Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, వినాయక్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను దంచి కొడుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తున్న విషయం తెల్సిందే. ‘అందాల రాక్షసి’, ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రాలతో పద్దతిగా, అందంగా కనిపించిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ‘మిస్టర్’ చిత్రంలో మరీ గ్లామర్‌గా కనిపించింది. ఆ చిత్రం సక్సెస్ కాకపోయినా కూడా లావణ్య త్రిపాఠి గ్లామర్‌తో మెప్పించింది. తాజాగా మెగా మూవీ ‘ఇంటిలిజెంట్’లో కూడా మరోసారి లావణ్య త్రిపాఠి తన గ్లామర్‌తో దుమ్మురేపింది.
ప్రచారంలో భాగంగా ఇంటిలిజెంట్ చిత్రం పోస్టర్స్ మరియు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది. ఆ స్టిల్స్‌లో లావణ్య త్రిపాఠి అందాల ప్రదర్శణ అదిరింది. ఇటీవలే విడుదలైన మెగాస్టార్ రీమిక్స్ సాంగ్ చమక్ చమక్ చామ్.. పాటలో కూడా లావణ్య త్రిపాఠి చాలా గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి గ్లామర్ హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. మరీ వల్గర్‌గా కాకుండా చాలా అందంగా దర్శకుడు లావణ్య త్రిపాఠిని చూపించాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠికి ఈ చిత్రంతో మరింత గుర్తింపు రావడం ఖాయం అని ఇప్పటికే విడుదలైన ఆమె పోస్టర్స్ మరియు స్టిల్స్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. వినాయక్ చిత్రంలో హీరోయిన్స్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే టాక్ ఉంది. మరి ఈ చిత్రంలో అయినా హీరోయిన్ లావణ్యకు ప్రాముఖ్యత ఉందేమో చూడాలి.