స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని ఆ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తన తరపున వాదించటానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను నియమించుకున్నారు. ఈకేసులో చంద్రబాబు తరపున వాదిస్తున్నారు లూథ్రా. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుకు బెయిల్ కోసం యత్నిస్తున్నారు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు వాయిదాలు వేస్తోంది.
తాజాగా సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైంది అని గురుగోవింద్ సింగ్ సూక్తిని సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం లూథ్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు ఇదే మా నినాదం అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరపున లూథ్రా వాదిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు రిమాండ్ విధించవద్దని..హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని వాదించారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని కాబట్టి హౌస్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ కోర్టుమాత్రం చంద్రబాబుకు రిమాండ్ విధించింది.