తననే నమ్ముకున్న మరో నేతను ముంచిన జగన్…!

Lella Appi Reddy Given the unexpected shock to Jagan

వైసీపీ అధ్యక్ష్యుడు వైఎస్ జగన్ తననే నమ్ముకుని ఉన్న నేతలకు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. వైసీపీలో కొత్తగా చేరిన నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలలో కాక పుట్టిస్తున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధినేత నేతలకు ఊహించని షాకిస్తున్నారు. మల్లాది విష్ణు కోసం వంగవీటి రాధా స్థానబ్రంశం, ఆనం కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని దూరం చేసుకోవడం, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజనీని సమన్వయకర్తగా నియమించడం, ఇప్పుడు తాజాగా ఇదే జిల్లా నుంచి పార్టీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డిని పక్కనపెట్టడంతో ఆ జిల్లలో మరో ముసలం పుట్టినట్టు అయ్యింది.

jagan-shok
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా మాజీ డీఐజీగా ఏసురత్నంను వైఎస్ జగన్ ఇటీవల నియమించారు. దీంతో ఈ నిర్ణయంపై లేళ్ల అప్పిరెడ్డి వర్గం తీవ్ర అసహనానికి గురైంది. చాలామంది అనుచరులు ఈరోజు అప్పిరెడ్డి కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. గౌరవం లేనిచోట ఉండొద్దనీ, వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోదామని నినాదాలు ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అప్పిరెడ్డి కార్యకర్తలను సముదాయించారు. తాము అభ్యంతరం వ్యక్తం చేసినా అయననే ఇన్ చార్జీగా కొనసాగించడంతో పార్టీ నుంచి వెళ్లిపోదామని అప్పిరెడ్డి వర్గీయులు అప్పిరెడ్డిని డిమాండ్ చేశారు. తాము నియోజకవర్గంలో పార్టీని బలపర్చేందుకు పనిచేస్తే సడెన్ గా బయటివ్యక్తికి నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ప్రస్తుతం అప్పిరెడ్డి వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవితో పాటు పశ్చిమం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.

jagan