రచ్చకెక్కిన ‘మా’ విభేదాలు…!

Maa Secretary Naresh Allegations On Shivaji Raja

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టే ఉన్నాయి. మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్‌లు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మారిపోయారు. ఈరోజు మధ్యాహ్నం శివాజీ రాజా, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావులు ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు వెల్లడించగా అప్పుడు కనపడని నరేష్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడమే కాక శివాజీ రాజా మీద పలు ఆరోపణలు చేశారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిల్వర్ జూబ్లీ ఏడాది కాబట్టి యూఎస్ కార్యక్రమం ప్లాన్ చేసామని వచ్చిందని, అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించామని దాంతో ఆయన వస్తానని చెప్పారని యూఎస్‌లో చిరంజీవి ప్రొగ్రామ్‌కు రూ. రెండుకోట్లు ఇస్తామన్నారని ఆయన అన్నారు. అయితే అంతా ఒకే అనుకున్నాక ఒక ప్రొగ్రామేనని దానికి రూ. కోటి అని చెప్పారని నరేష్ అన్నారు. అందుకు ఒప్పుకుని సంతకం కూడా చేశామన్నారు.

naresh-ma
అయితే అక్కడికి మా సభ్యులు బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌తో అమెరికా వెళ్లడం దారుణమన్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నందుకే తన అభిప్రాయం వినడం లేదన్నారు. శివాజీరాజాపై వచ్చిన ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. చిరంజీవి ఈవెంట్ కు కోటి రూపాయిలు మాత్రమే వచ్చింది అనగానే అనుమానం కలిగిందని, అమెరికాలో అంత పెద్ద ఈవెంట్ చేస్తే కోటి రూపాయిలు మాత్రమే వచ్చాయా? అని నరేష్ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి గారి ప్రోగ్రాం తర్వాత మహేష్ తో ప్రోగ్రాం ప్లాన్ చేస్తే శివాజీ రాజాను ఇంటికి తీసుకెళ్ళానని నరేష్ ఉంటె మహేష్ తప్పక వస్తారని నమ్రత మాట ఇచ్చిందని కానీ వాళ్ళు వేరే వాళ్ళతో కాల్స్ చేయించారని ఆయన ఆరోపించారు.

naresh-cinema-association