Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనకు తెలియని భాషలో మాట్లాడటమంటేనే చాలా కష్టం. ఎలాగోలా నేర్చుకుని పదం పదం ఒత్తి పలుకుతూ వచ్చీరానట్టుగా మాట్లాడతాం. ఇక ఆ భాషలో పాట రాయటమంటే… మనకు తెలిసిన భాషలోనే సినిమా పాట రాయటానికి చాలా కష్టపడాలి. మనసులో వచ్చే ఆలోచనల్ని క్రమబద్దంగా పేర్చుకుంటూ, సన్నివేశాన్ని ఊహించుకుంటూ దానికి తగ్గట్టుగా పాటలోని మాటలను పొందుపర్చాలి.
ఇక పరాయి భాషలో పాట రాయటమంటే…అది అందరికీ సాధ్యమయ్యేపని కాదు…నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే వాళ్లు సైతం మాతృభాషలోనే పాటలు రాయటానికి మొగ్గుచూపేది అందుకే. కానీ తమిళ పాటల రచయిత మదన్ కర్కీ మాత్రం తెలుగులో అవలీలగా ఓ పాట రాసేశారు. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్ర కోసం పాట రాశారు మదన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు.
సెప్టెంబరు 27న స్పైడర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తునన్నారు మదన్. స్పైడర్ కు ముందే మదన్ కర్కీకి తెలుగులో గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన బాహుబలిలో ప్రత్యేక కిలికిలి భాషను సృష్టించింది మదన్ కర్కీనే. ఆయన సృష్టించిన ఈ భాషకు బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. మరి స్పైడర్ లో పాటతో మదన్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి
మరిన్ని వార్తలు:
శరత్ మరార్ను పవన్ ఇందుకే దూరం పెట్టాడా?
వెబ్ సిరీస్ లో రానా