రష్యాలో భూకంపం.. 7.5 భారీ తీవ్రతగా నమోదుఓ పక్క కరోనా.. మరో పక్క సునామీ హెచ్చరికలు

ప్రపంచమంతా ఓ పక్క కరోనా వైరస్ తో వణికిపోతుంటే మరో పక్క సునామీలతో దద్దరిల్లిపోతుంది. అసలు ఈ సమాజానికి ఏమైంది అంటూ జనం గడగడలాడిపోతున్నారు. తాజాగా రష్యా, జపాన్, హవాయ్ లలో 7.5 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఈ భూకంపం ఏర్పడటం, దాని తీవ్రత భారీగా ఉండటంతో వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే సునామీ సంభవించే అవకాశం లేదని వెంటనే ఆ హెచ్చరికలను ఉపసంహరించాయి.

అయితే రష్యా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. రష్యాకు చెందిన కురిల్ ఐలండ్స్ సమీపంలో పసిఫిక్ మహాసముద్రం గర్భంలో భారీస్థాయిలో ప్రకంపణలు రావడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం జపాన్ సస్సొరొ నగరానికి ఈశాన్యం దిక్కున 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిపిక్ మహాసముద్రం గర్భంలో వచ్చింది. అయితే అక్కడే 59కిలోమీటర్ల లోతు కలిగి ఉన్న ఏరియాను భూకంప కేంద్రంగా గుర్తించారు… కానీ… చాలా తీవ్రంగా రిక్టర్ స్కేల్ పై 7.5 నమోదు కావడంతో సునామీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కాగా ఆ తర్వాత అంతగా సునామీలు ఏర్పడం అవకాశం లేదని తేలడంతో ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.