Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంకు అనూహ్య స్పందన దక్కింది. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్య పోయే విధంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి కలెక్షన్స్‌ను ఇస్తున్నారు. రికార్డులు బద్దలయ్యేలా వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయం అని తేలిపోయింది. ఓవర్సీస్లో ఈ చిత్రంను అతి తక్కువ రేటుకు మొదట ఒక డిస్ట్రిబ్యూటర్ అడగడం జరిగింది. అందుకు తిరష్కరించిన నిర్మాతలు ఒక మంచి రేటుకు అమ్మారు. అయితే డిస్ట్రిబ్యూటర్ చాలా ఎక్కువ మొత్తం పెట్టాడని, పెట్టుబడి కూడా రాదంటూ కొందరు ఎద్దేవ చేశారు. కాని ఓవర్సీస్ సీస్ డిస్ట్రిబ్యూటర్ పంట పండినట్లయ్యింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.
ఓవర్సీస్లో టాలీవుడ్ టాప్ 5 చిత్రాల్లో ఒక్కటిగా మహానటి నిలవడం ఖాయం అని తేలిపోయింది. తెలుగులో ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లు అన్ని వర్గాల వారిని ఆశ్చర్యపర్చుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా డబ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాతకు లాభాలు ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఏరియాల్లో అశ్వినీదత్ స్వయంగా విడుదల చేయడం జరిగింది. దాంతో డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా అశ్వినీదత్కే వస్తుంది. ఇలా భారీ ఎత్తున లాభాలతో వైజయంతి మూవీస్ రికార్డులు సృష్టిస్తోంది. ఒక మంచి సినిమాగా నిలుస్తుందని భావించాం కాని, ఇంతటి కమర్షియల్ సక్సెస్‌ను సాధిస్తుందని తాము భావించలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.