Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తున్న విషయం తెల్సిందే. ఆశించిన కలెక్షన్స్‌కు దాదాపు మూడు రెట్ల వసూళ్లు ఇప్పటికే నమోదు అయ్యాయి. తాజాగా విడుదలైన ‘నేలటిక్కెట్టు’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో మరో వారం రోజుల పాటు మహానటికి ఎదురు లేదు అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ చిత్రం 40 కోట్ల మేరకు షేర్‌ను వసూళ్లు చేసిందని, లాంగ్ రన్లో మరో 20 కోట్ల వరకు వసూళ్లు చేయడం ఖాయం అంటూ నమ్మకంగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో లాంగ్ రన్లో ఈస్థాయి వసూళ్లు సాధిస్తున్న సినిమా ఇదే అని, ఏ సినిమా అయిన విడుదలైన వారం వరకే ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది. కాని ఈ చిత్రం మొదటి వారంలో కాస్త డల్‌గా అనిపించినా, రెండవ వారం నుండి అనూహ్యంగా పుంజుకుంది. క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల వారు, పాత తరం వారు అంతా కూడా సావిత్రి జీవిత చరిత్రను వెండి తెరమీద చూడాలని ఆశ పడుతున్నారు. ఆమె గురించి తెలియని ఎన్నో విషయాలను చిత్రంలో చూపించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా కూడా ఈ సినిమాకు బారులు తీరుతున్నారు. వీకెండ్స్ మరియు వీక్ డేస్‌లలో కూడా ఈ చిత్రంకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక వేళ నేలటికెట్ సూపర్ హిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మహానటి కలెక్షన్స్‌పై ప్రభావం పడేది. కాని ఇప్పుడు ఆ ఆందోళన ఏమీ లేదు. నేలటిక్కెట్టు చిత్రం ఫ్లాప్ అంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అంటున్నారు. కనుక మహానటి మహాజోరు కొనసాగడం ఖాయం.