Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’కి జనాలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఈ చిత్రాన్ని చూడాలని ఆశ పడుతున్నారు. సావిత్రి గారంటే అభిమానం ఉన్న వారు ఈ చిత్రాన్ని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో భారీ ఎత్తున వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ చిత్రాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. సావిత్రిని ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ఇష్టపడతారు. అందుకే వారి కోసం ఓల్డ్ ఏజ్ హోంలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ఓల్డేజ్ హోంలో జూన్ 3 తర్వాత ఈ చిత్రాన్ని వారి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎవరైతే తమ ఓల్డేజ్ హోంలో ఈ చిత్ర ప్రదర్శణ కోరుకుంటారో వారు తమ తమ వివరాలను తెలియజేస్తూ మా మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సిందిగా సూచించారు. ఈ ఆలోచనతో సినిమాను మరింత మందికి చేరువ చేస్తున్నారు. ఒక సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఈ రోజుల్లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం, అందరి దృష్టిని ఆకర్షించడం చాలా ముఖ్యం. ఆ ముఖ్యమైన పనిని స్వప్న మరియు ప్రియాంకలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అందుకే మహానటి ప్రస్తుతం ఈస్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.