మహేష్ బాబు సినిమాల్లో స్టార్ గా దూసుకు పోతూనే, బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ సినిమా రంగానికి సంబందించిన మల్టీ ఫ్లెక్స్ రంగంలోకి ఆసియన్ సునీల్ తో కలిసి ఎంట్రీ ఇస్త్తున్నాడు. AMB అనే ఈ మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ ను కొండాపూర్, కొత్తగూడెం సమీపంలోని నిర్మించారు. మొదట థగ్స్ అఫ్ హిందూస్తాన్ చిత్రం తో AMB మల్టీ ఫ్లెక్స్ ను ఓపెన్ చెయ్యాలి అనుకున్నాడు. స్పెషల్ గెస్ట్ గా అమీర్ ఖాన్ ను ఆహ్వానించాలి అనుకున్నాడు కానీ కొన్ని అనివార్యకారణాల వలన కుదరలేదు.
రీసెంట్ గా శంకేర్ దర్శకత్వంలో వచ్చినా 2.ఓ చిత్రం తో ఓపెన్ చేస్తారు అనే టాక్ వినపడింది కానీ మహేష్ ప్రస్తుతం మహార్హి సినిమా వలన కాల్ షీట్స్ బిజీగా ఉండటంతో కుదరలేదు. ఎట్టకేలకు AMB సినిమాస్ పై ఓ నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్ 2 న ఓపెన్ చేయ్యనున్నాడు. సాయంత్రం 4.30 నిమిషాల నుండి మొదటి ఆటతో AMB సినిమాస్ ను ప్రారంబిస్తారు. నూతన సాంకేతికతో, అత్యాధునిక సిట్టింగ్ తో ఈ మల్టీ ఫ్లెక్స్ ని రూపొందించారు. ఇందులో సెవెన్ స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం స్క్రీన్స్ కలిపి 1600 వరకు సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది అని తెలుస్తుంది.