మళ్ళీ రావా… తెలుగు బులెట్ రివ్యూ

Malli Raava Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   సుమంత్ ,  ఆకాంక్ష సింగ్ 
నిర్మాతలు:   రాహుల్ యాదవ్ నక్కా 
దర్శకత్వం :    గౌతమ్ తిన్నానురి 
మ్యూజిక్ :  శ్రావణ్  భరద్వాజ్ 

అక్కినేని క్యాంపు హీరో సుమంత్ ని విజయం వరించి చాన్నాళ్లు అయ్యింది. అందుకే ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నరుడా డోనరుడా ప్లాప్ అయ్యాక సుమంత్ దగ్గరికి వెళ్లిన కథ మళ్లీ రావా. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత అంతా కొత్తవాళ్లే. అయినా వారిని నమ్మి సుమంత్ ముందుకు వెళ్ళాడు సుమంత్. ఆ నమ్మకాన్ని “మళ్లీ రావా “ సినిమా నిలబెట్టుకుందో ,లేదో చూద్దామా.

కథ…

కార్తీక్ ( సుమంత్) , అంజలి ( ఆకాంక్ష సింగ్ ) టీనేజ్ లోనే ప్రేమలో పడతారు. వారు బాగా క్లోజ్ అయ్యారు అనుకునేంతలో ఓ సమస్య రావడం ,లేదా ఎవరైనా పుల్ల వేయడమో అవుతుంది. దీంతో పెళ్లి పీటలు ఎక్కడమే ఇక మిగిలింది అనుకునే తరుణంలో వాళ్ళు ఇద్దరూ విడిపోతారు. అందుకు దారి తీసిన కారణాలు ఏమిటి ? తిరిగి ఆ జంట ఒక్కటి అయ్యిందా ,లేదా అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ …

1999 లో మొదలు అయిన ప్రేమకథ 2017 లో ఏ ముగింపుకు వచ్చింది అన్న పాయింట్ ని బేస్ చేసుకున్న ఈ సినిమా కథ కన్నా కధనం చాలా బాగుంది. టీనేజర్స్ లవ్ ని చూసే విధానం మొదలుకుని మెచ్యూరిటీ వచ్చాక ఎలా ఉంటుంది అన్న దాకా దర్శకుడు తాను తీసుకున్న పాయింట్ నుంచి అటు ఇటు జరక్కుండా ప్రేక్షకుడికి చూపిన విధానం బాగుంది. ఈ క్రమంలో వినోదం అని లేనిపోని సీన్స్ , సెంటి మెంట్ , ఎమోషన్ అని డ్రామా కోసం ఎక్కడా ప్రయత్నించలేదు. కళ్ల ముందు ఓ సినిమా గాకుండా పక్కింట్లో ఓ లవ్ స్టోరీ జరుగుతుంటే చూస్తున్నట్టు అనిపించేలా పూర్తిగా రియలిస్టిక్ గా సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం.ఈ స్టోరీ కి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయ్యింది. ఒకే సారి అన్ని దశల్లో జరిగే విషయాలను ఏ మాత్రం కన్ ఫ్యూజన్ లేకుండా చూపడంలో గౌతమ్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక లవ్ సీన్స్ ని ఈ మధ్య కాలంలో ఇంత సహజంగా తీసిన దర్శకుడు లేడు.

తనకు ఓ మంచి కథ, దర్శకుడు పడితే ఎలా ఉంటుందో సుమంత్ ఈ సినిమాలో చూపించాడు. కానీ చూద్దామన్నా మీకు సుమంత్ కనిపించడు. కార్తీక్ తప్ప. సుమంత్ కెరీర్ మొత్తం మీద ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పడానికి ఓ క్షణం కూడా ఆలోచించే పనిలేదు. చాలా సన్నివేశాల్లో సుమంత్ సున్నితమైన భావోద్వేగాలను భలే పండించాడు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కి సుమంత్ కన్నా ఒక్క మార్క్ కూడా తక్కువ వేయలేం. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టు చేయడంలో వీళ్ళు 100 పెర్సెంట్ సక్సెస్ అయ్యారు.

సాంకేతికంగా కూడా “మళ్లీ రావా “ గురించి తప్పు పట్టేందుకు లేదు. నిర్మాణ విలువలు ఎంత బాగున్నాయో మ్యూజిక్, కెమెరా , డైలాగ్స్ కూడా అలాగే ప్లస్ అయ్యాయి. అన్ని విభాగాలు సినిమా రేంజ్ పెంచడంలో తమ వంతు పాత్ర పోషించాయి.

తెలుగు బులెట్ పంచ్ లైన్ …”మళ్లీ రావా “ అని సుమంత్ ని పిలిచేలా చేసాడు దర్శకుడు.
తెలుగు బులెట్ రేటింగ్… 3.25 / 5 .