ఈ మధ్య కాలంలో సెల్ఫీ సూసైడ్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు తమ బాధను ఒక పేపర్ మీద పెట్టి చనిపోయ రోజులు పోయి, తమ జీవితంలో ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, బాస్… ఇలా తమకు ఎదురైన అనుభవాలను సెల్ఫీ వీడియో తీసి కొందరికి షేర్ చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు తరచుగా జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కృష్ణలంకకు చెందిన గురువా రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న గురువారెడ్డి తన చావుకు భార్య గాయత్రి, అత్తమామలు, బావమరిది కారణమని వీడియోలో చెప్పాడు. తనను క్షమించాలని తల్లిందండ్రులను కోరి రైలు కింద పడి ప్రాణాలు వదిలాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారెడ్డి మృతిపై విచారణ జరిపారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గురువారెడ్డి భార్యకు కార్తీక్ అనే యువకుడికి మధ్య ఎఫైర్ ఉందని పోలీసులు గుర్తించారు.
తన భార్య, కార్తీక్ ల మధ్య చాటింగ్, ఫోన్ సంభాషణల విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు గురవారెడ్డి. అయితే కూతురికి మంచి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఆ పని చేయకుండా ఈ విషయమై గురువారెడ్డిని బెదిరించేందుకు గాను గురువారెడ్డి భార్య, తల్లిదండ్రులు, బావ మరిది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారెడ్డిని పిలిచి విచారించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయకున్నా రెండు రోజుల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పారని గురువారెడ్డి మనోవేదనకు గురయ్యాడు. కార్తీక్‌తో తన భార్యకు ఉన్న సంబంధం విషయమై చోటు చేసుకొన్న విషయమై నిలదీస్తే తనను దోషిగా చిత్రీకరించారని గురువారెడ్డి మనస్థాపం చెందారు. తనను భార్యతో పాటు అత్తింటివారు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనే విషయమై సెల్పీ వీడియోలో రికార్డింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.