ఎన్నెన్ని చట్టాలు చేస్తున్నా…ఆడవారి మీద అకృత్యాలు ఆగడం లేదు. విచిత్రం ఏమిటంటే ఇటీవల మగవారి మీద కూడా అఘాయిత్యాలు పెరిగాయి. 12ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష, వయసుతో సంబంధం లేకుండా యావజ్జీవ శిక్ష విధించేలా చట్టాన్ని కూడా రూపొందించారు అయినా ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఢిల్లీలో ఓ భయంకర సంఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కూతురి వయసున్న చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆగస్టు 8నే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా ఈరోజు బయటకొచ్చింది. పాప పై అత్యాచారానికి పాల్పడింది ఆ పాప స్కూల్లో పనిచేసే ఎలక్ట్రీషియన్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని గోలే మార్కెట్ ప్రాంతానికి చెందిన చిన్నారి సర్కారు బడిలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం స్కూలు ముగిశాక పాప క్లాసులో నుంచి బయటకు వచ్చింది. పాప ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఎలక్ట్రీషియన్ రామ్ ఆశ్రే చిన్నారిని అడ్డుకున్నాడు. ఆమెకు చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి.. స్కూల్లోని ఓ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. చిన్నారి ఏడుస్తుండటంతో ఏం జరిగింద తల్లిదండ్రులు ప్రశ్నించగా తనకి ఏమి జరిగిందో ఆ పాపకేమి తెలుసు పాపం. రక్తం మరకలు చూసి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.