విడాకులా… ఆమె నా దేవత

Manchu Manoj clarity on Divorce with his wife Pranathi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంచు ఫ్యామిలీ హీరో మనోజ్‌ తన భార్య ప్రణతికి విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రణతి మరియు మనోజ్‌ సుదీర్ఘ కాలం ప్రేమించుకుని, ఇద్దరు కూడా కుటుంబ పెద్దలు అంగీకారంతో ఒక్కటి అయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరు కూడా పలు కార్యక్రమాల్లో కలిపి పాల్గొన్న సమయంలో చాలా అన్యోన్యంగా ఉన్నారు అంటూ అంతా అనుకున్నారు. అలాంటి వీరు ఎందుకు విడాకులు తీసుకుంటారు అంటూ అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలోనే మంచు మనోజ్‌ తన విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన మంచు మనోజ్‌ ఆ సమయంలోనే తాను విడాకులు ఇవ్వబోవడం లేదు అంటూ పేర్కొన్నాడు.

మంచు మనోజ్‌ను ఒక అభిమాని మీరు త్వరలో మీ భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరు తప్పకుండా స్పందించాలి అంటూ కోరాడు. అందుకు సమాధానంగా మంచు మనోజ్‌ సింపుల్‌గా ‘వాళ్ల బొంద, ప్రణతి నా దేవత’ అంటూ ఒకే ఒక్క పదంతో పుకార్లన్నింటికి చెక్‌ చెప్పేశాడు. భారీ ఎత్తున వీరిద్దరి గురించి జరుగుతున్న ప్రచారంకు దీంతో ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. సెబ్రెటీల జీవితాల గురించి ఎందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు, అసలు ఎవరు ఇలాంటివి మొదలు పెడతారు అంటూ కొందరు సినీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాదారణ వ్యక్తుల జీవితాల మాదిరిగానే సెలబ్రెటీల జీవితాలు కూడా అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని, సెలబ్రెటీల మనోభావాలతో ఆడుకోవడం మంచి పద్దతి కాదు అంటూ గాసిప్స్‌ రాయుళ్లకు మంచు ఫ్యామిలీ సన్నిహితులు హెచ్చరించారు.