Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ కావాలని కలలు కన్నది. కాని ఆమె అనుకున్నది చేయలేక పోయింది. కావాలనుకున్నది కాలేక పోయింది. నిర్మాతగా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయిన మంజుల తాజాగా ‘మనసుకు నచ్చింది’ అంటూ ఒక చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. మహేష్‌బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించడంతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలు చేయించారు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి. మనసుకు నచ్చింది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ ప్రచారం జరిగింది. మంజుల ఈ చిత్రంతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకుంటుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ఈ చిత్రం పరమ రొటీన్‌గా, ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.
మంజుల మొదటి సినిమాతోనే దర్శకురాలిగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినీ వర్గాల వారికి మరియు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. సినిమాపై అంచనాలు పెట్టుకున్న వారు అంతా కూడా ఢీలా పడిపోయారు. ఇలాంటి సమయంలో మంజులను నమ్మి మరో నిర్మాత ఆమెతో సినిమాను చేసేందుకు ముందుకు వస్తాడా అంటే అనుమానమే అని సినీ వర్గాల వారు అంటున్నారు. సొంతంగా తన సినిమాను తానే నిర్మించుకుని దర్శకత్వం వహిస్తే తప్ప ఆమెతో ప్రయోగం చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు వచ్చే అవకాశం లేదు. అసలు ఇంతటి ఫ్లాప్ తర్వాత మంజుల మళ్లీ దర్శకురాలిగా ప్రయత్నం చేస్తుందా అనేది కూడా అనుమానమే. ఆమె దర్శకురాలిగా మరో సినిమా చేయకుంటేనే గౌరవ ప్రథంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి మంజుల మలి ప్రయత్నం చేస్తుందా లేక తొలి ప్రయత్నంతోనే ఆపేస్తుందా అనేది చూడాలి.