కేవలం అయిదు రోజుల క్రితమే బెంగాల్ కు చెందిన ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్ ల నుండి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తాజాగా మళ్ళీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఎందుకు ఇంత త్వరగా తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చిందో కూడా మనోజ్ తివారీ చెప్పడం విశేషం. మనోజ్ తివారీ మాట్లాడుతూ … నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఏదో ఆలోచించకుండా తీసుకున్నానని.. కానీ ఆ తర్వాత బాగా అలోచించి ఇంకా బెంగాల్ క్రికెట్ కు ఎంతో చేయాల్సింది ఉందని గ్రహించి నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు.బెంగాల్ కు రంజీ క్రికెట్ కు ఇంకో సంవత్సరం మాత్రమే ఆడుతానని, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సేబాషిస్ గంగూలీ సమక్షములో ఈ నిర్ణయాన్ని మనోజ్ తివారీ వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు.