మరకతమణి… తెలుగుబుల్లెట్ రివ్యూ.

marakathamani Telugu movie review

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Marakathamani Movie Review

నిర్మాణ సంస్థలు: రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్‌
తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని, అనంత్‌రాజ్‌, కోటశ్రీనివాసరావు, రాందాస్‌ తదితరులు
సంగీతం: దిబు నినన్‌ థామస్‌
ఛాయాగ్రహణం: పివి శంకర్‌
కూర్పు: ప్రసన్న జికె
నిర్మాణం: రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్‌
దర్శకత్వం: ఎ.ఆర్‌.కె.శరవణన్‌

భిన్నమైన కధలు, వినూత్నమైన ఆలోచనలతో తన కెరీర్ కే కాకుండా మొత్తం సినీ రంగంలోనే సానుకూల మార్పులకు దోహదం చేసే కుర్ర హీరోలు ఇప్పుడు చాలా మంది కనిపిస్తున్నారు. వారిలో ఒకరు ఆది పినిశెట్టి. హీరో అనగానే రొటీన్ గా కనిపించే వ్యవహారాలకు దూరంగా కధలు ఎంచుకుంటున్న ఆది ఇప్పుడు కొత్తగా తమిళంలో చేసిన సినిమా మరకతమణి. ఓ అడ్వెంచరస్ కధకి కచ్చితంగా ఇమిడిపోయే హారర్, కామెడీ ని సరైన పాళ్ళలో బ్లెండ్ చేసిన సినిమా మరకతమణి. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ..

ఓ అల్లరిచిల్లరి అబ్బాయి రఘు.వున్న అప్పులు తీర్చుకోడానికి చిన్నాచితకా దొంగతనాలు చేస్తుంటాడు.ఓ పెద్ద దొంగతనం చేసి సమస్యలన్నీ తీర్చుకోవాలని రామ్ దాస్ అనే అతను నడిపే స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడు.ఇదే సమయంలో రఘు ప్రేమించిన అలేఖ్య వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది.ఆ బాధలో వున్న రఘు కి మరకత మణి తెచ్చిస్తే పది కోట్లు ఇస్తామని ఓ ఆఫర్ వస్తుంది.అయితే ఆ మణిని తాకిన 132 మంది చనిపోయి ఆత్మలుగా మారారని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకున్న రఘు ఆత్మల ద్వారానే మరకత మణి సాధించడానికి ప్రయత్నిస్తాడు.అలా ఆత్మల సాయంతో మణి పొందడానికి రఘు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి,ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు,వాటిని రఘు పరిష్కరించగలిగాడా అన్నది తెలుసుకోవాలంటే మరకత మణి చూడాలి.

విశ్లేషణ..

శరవణన్ దర్శకత్వం వహించిన మరకతమణి సినిమా గురించి చెప్పాలంటే తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా, సూర్య హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమాల్ని కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా వుంది. పోలిక కోసం ఆ మాట చెప్పినా సబ్జెక్టు లో ఫ్రెష్ నెస్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓ మణి కోసం ప్రయత్నం, ఆత్మలు, హీరో లవ్ స్టోరీ, విలన్ ఎంట్రీ ఇలా ఇన్నిటిని కలుపుతూ ఓ సినిమా చేయడమే కష్టం అనుకుంటే ఆ సినిమాని వినోదాత్మకంగా నడపడం అంత కన్నా కష్టం. కానీ ఆ ఫీట్ ని సాధించి చూపెట్టాడు దర్శకుడు శరవణన్. ఇక హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాకి ప్రతి దశలో ఆది అదనపు విలువ జోడించాడు. ఇంత సీరియస్ సబ్జెక్టు ని ఇలా వినోదాత్మకంగా డీల్ చేయడం అన్నది స్క్రిప్ట్ దశలో తీసుకున్న జాగ్రత్త అని తెలుస్తూనే వుంది. కామెడీ ట్రాక్ సినిమాకి హైలైట్. కోట మరోసారి తన నటనతో అదరగొట్టాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ అతికించినట్టు తెలిసిపోతుంది. తమిళ వాసనలు, అక్కడక్కడా లాజిక్ మిస్ కావడం అన్న చిన్నచిన్న లోపాలు మినహాయిస్తే ఇది ఓ మంచి సినిమా. ప్రేక్షకుడు హాయిగా నవ్వుకుంటూ బయటికి వచ్చే సినిమా. సంగీతం, ఫోటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ఉపయోగ పడ్డాయి.

ప్లస్ పాయింట్స్ ..

కథ,కధనం
వినోదం
హీరో
దర్శకత్వం
మ్యూజిక్
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ ..

కొన్ని చోట్ల లాజిక్ మిస్
బ్రహ్మానందం

తెలుగుబుల్లెట్ పంచ్ లైన్… “మరకతమణి “ప్రకాశించింది.
తెలుగు బులెట్ రేటింగ్… 3 /5 .