రవితేజ వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి…!

Madhavan Clarify TO Role In Ravi Teja Movie

ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కొత్త కొత్త ట్రెండ్స్‌ పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. పెద్ద ఎత్తున వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కుతున్న ఈ సమయంలో వెబ్‌ సిరీస్‌లపై స్టార్‌ హీరోలు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. హాలీవుడ్‌లలో మొదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ మెల్ల మెల్లగా ఇండియన్‌ సినిమా పరిశ్రమపై కూడా పడినది. బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. వెబ్‌ సిరీస్‌ల వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు దక్కించుకోవచ్చు అనేది సినీ వర్గాల వారి అబిప్రాయం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమలో కూడా వెబ్‌ సిరీస్‌లపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే స్టార్స్‌ మాత్రం నటించేందుకు ఆసక్తి చూడం లేదు.

raviteja

మొట్టమొదటగా రవితేజ ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం కనిపిస్తుంది. స్టార్‌ హీరోల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వెబ్‌ సిరీస్‌లో నటించిన దాఖలాలు లేవు. తాజాగా రవితేజ ఒక వెబ్‌ సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. రికార్డు స్థాయిలో బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. తెలుగులో కూడా ఇప్పటి వరకు పలు వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. కాని వాటిల్లో పెద్ద హీరోలు లేక పోవడంతో ఏ ఒక్కరు వాటిని పట్టించుకోలేదు. తాజాగా రవితేజ నటిస్తాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ చిత్రంపై ఉంది. తాజాగా రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. హీరోగా అవకాశాలు సన్నగిల్లిన సమయంలో వెబ్‌ సిరీస్‌లో నటించడం మరియు విలన్‌గా నటించేందుకు ఓకే చెప్తాడట.

Ravi-Teja--and-thaman