ఎన్టీఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌

Upasana posted their pic with the Sadguru and captioned it,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశంలోని నదుల సంరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, దార్శనిక వేత్త జగ్గీ వాసుదేవ్‌కు మద్దతుగా ఇటీవలే బిగ్‌బాస్‌ షో ద్వారా ఎన్టీఆర్‌ మద్దతు పలికిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌ నుండి జగ్గీ వాసుదేవ్‌కు మద్దతు పలికిన మొదటి హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు. దేశ వ్యాప్తంగా జగ్గీ వాసుదేవ్‌గారికి మద్దతు పెరుగుతుంది. ఆయన చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు కోట్లల్లో జనాలు ముందుకు వస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా క్యూ కడుతున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ దంపతులు సైతం జగ్గీ వాసుదేవ్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు.

ఇటీవలే రామ్‌ చరణ్‌ దంపతులు స్వయంగా జగ్గీ వాసుదేవ్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా వాసుదేవ్‌తో పలు అంశాలపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయన చేసే ఉద్యమంలో తాము పాల్గొంటామని, ఆర్థికంగా కూడా వెన్ను దన్నుగా ఉంటామని ఉపాసన రామ్‌ చరణ్‌లు హామీ ఇచ్చారట. జగ్గీ వాసుదేవ్‌తో దిగిన ఫొటోను ఉపాసన ట్వీట్‌ చేయగా, రామ్‌ చరణ్‌ ఫేస్‌బుక్‌లో సద్గురు నివాసంలో చాలా పాజిటివ్‌గా అనిపించింది, మన రైతులకు సాయం చేయడంతో అంతా మద్దతు తెలుపుదాం అంటూ పేర్కొన్నారు. రామ్‌ చరణ్‌ ఒక వైపు ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తూనే మరో వైపు చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.