మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా చిరంజీవి చిన్నల్లుడు, శ్రిజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ మొదటి చిత్రం ‘విజేత’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక నాయర్ నటించిన విషయం తెల్సిందే. ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన ‘విజేత’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూలు వచ్చేశాయి. మెగా హీరో అయినంత మాత్రాన సక్సెస్ దక్కాలని ఏమీ లేదు. అందరు హీరోల మాదిరిగానే ఈ హీరో కూడా ఒక ఫ్లాప్‌ను చవి చూశాడు.
ఇక మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ గురించి మెగా ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ప్రతిభ లేకున్నా సినిమాల్లోకి వస్తాను అంటూ అభిమానులు కూడా సహకరించరు. కళ్యాణ్ సినిమా కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. నటన మరియు ఇతరత్ర విషయాల్లో కళ్యాణ్ ఇంకా శిక్షణ తీసుకోవాల్సి ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. నటనలో, డైలాగ్ డెలవరీలో, బాడీలాంగ్వేజ్‌లో, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌లో, యాక్షన్స్‌లో ఇలా అన్ని విధాలుగా కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు. సినిమాల్లో నటించాలనే తపన ఉన్నప్పటికి కళ్యాణ్‌కు నటన పట్ల ఓనమాలు కూడా తెలిసినట్లుగా లేవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కళ్యాణ్ మెగా హీరో అయినప్పటికి నటన పరంగా ఆకట్టుకుంటేను రాణించగలడు అంటూ స్వయంగా మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.