Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాదిన హీరోలకి స్టార్ డమ్ ఎంత క్రేజీగా ఉంటుందో అన్నీ ఇబ్బందులూ తెస్తుంది. ఫాన్స్ తమ మీద పెట్టకునే అంచనాలు వారికి భారంగా తయారు అవుతాయి. మనసుకి నచ్చిన కథ దొరికినా అది ఫాన్స్ కి నచ్చుతుందో,లేదో అన్న సంశయం. అందుకే ఇక్కడ స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. చేసినా ఆ స్థాయి విజయాలు సాధించలేకపోతున్నారు.
దీనికి ప్రధాన కారణం ఫాన్స్ అభిప్రాయాలు. అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో తెలిపే ఎన్నో సంఘటనలు చూసాం. ఓ రెండేళ్ల కిందట ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య గొడవ ఓ హత్యకి దారితీసిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూసాం. అప్పుడు పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ఇద్దరూ తమ ఫాన్స్ కి సంయమనం పాటించడం ఎంత అవసరమో చెప్పారు.
తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చారు. అక్కడ పవన్ ,ఎన్టీఆర్ ఇద్దరూ ఎంతో స్నేహపూర్వభాకంగా మెలిగారు. తమ పేరు చెప్పుకుని గొడవపడే ఫాన్స్ నిజానికి వారిద్దరూ వ్యవహరించిన తీరు చూసి ఎంతో నేర్చుకోవాలి.తాము కూడా సినిమాని ఏ స్థాయిలో చూడాలో, అభిమానం ఎంతవరకు వుంచుకోవాలో తెలుసుకోవాలి. కానీ పవన్,ఎన్టీఆర్ క్లోజ్ గా వున్న ఫోటోలు బయటికి వచ్చాయో లేదో వెంటనే కొందరు పనిగట్టుకుని దీనికి వేరే రంగు పులుముతున్నారు.
మెగా స్టార్ చిరు, రామ్ చరణ్ సినిమాల ఫంక్షన్స్ లో పాల్గొడానికి చొరవ చూపని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కి వెళ్లడాన్ని తప్పుబడుతున్నారు. మెగా ఫామిలీ హీరో అయివుండి ఎన్టీఆర్ తో అంత రాసుకుపూసుకు తిరగడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. నిజానికి దానికి దీనికి అంబంధం లేదు. అయినా హీరోలు మంచిగా ఉంటే సంతోషపడాల్సింది పోయి రాజకీయాలు, ఫ్యాక్షన్ లాగా వ్యవహరించాలని కోరుకోవడంలో అర్ధమే లేదు. ఈ విషయాన్ని స్టార్ హీరోల ఫాన్స్ ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అది వారికి , వారి ఫాన్స్ కి కూడా ఉపయోగం.