Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎంత మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా సరైన దర్శకుడు లేదా సరైన సినిమాలు పడకుంటే ఆ హీరో ఎదగలేడు. మంచి సినిమా ఛాన్స్‌లు చాలా అరుదుగా, తక్కువ మంది హీరోలకు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఆ ఛాన్స్‌లు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు వస్తున్నాయి.
గబ్బర్‌సింగ్‌తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాన్ని చేసి తన స్థాయిని పెంచుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత పలు చెత్త నిర్ణయాలు తీసుకుని వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. తాజాగా ఈ మెగా హీరోకు అనుకోని అవకాశంలా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసే అవకాశం దక్కింది.
ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో చేస్తున్న ‘జవాన్’ చిత్రం ఫలితం పాజిటివ్‌గా ఉంటుందనే నమ్మకం మెగా ఫ్యాన్స్‌లో లేదు. ‘జవాన్’ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ చేయబోతున్న సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ఆ సినిమా పట్టాలెక్కింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించారు. వినాయక్ గత చిత్రాల ట్రాక్ రికార్డులు చూస్తే ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్‌కు కెరీర్లోనే ది బెస్ట్ సక్సెస్ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక వినాయక్‌తో చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘తొలి ప్రేమ’ వంటి అద్బుత ప్రేమ కథా కావ్యంను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చిత్రం చేయబోతున్నాడు. ‘తొలిప్రేమ’ చిత్రం మాదిరిగానే అలాంటి ఒక ప్రేమ కథతో సాయి ధరమ్ తేజ్‌ను లవర్ బాయ్‌గా కరుణాకరన్ చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వినాయక్, కరుణాకరన్ చిత్రాలు సక్సెస్ అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరిన్ని వార్తలు: