Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మెహబూబా’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కాని ఊహించని విధంగా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం కనీసం 5 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ చిత్రంను పూరి ఏకంగా 30 కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చు చేసి నిర్మించడం జరిగింది. ఈ సినిమా కోసం తన ఇల్లును కూడా అమ్మేశాడు. సినిమా విడుదలకు ముందు దిల్‌రాజు 9 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఆ మొత్తం పక్కన పెడితే మొత్తంగా పూరికి పెద్ద నష్టం తప్పడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో పూరి థ్యాంక్స్ మీట్ అంటూ పెట్టి తన పరువును తానే తీసుకున్నాడు.
ఈ మద్య టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌గా థ్యాంక్స్ మీట్‌ు ప్రారంభం అయ్యాయి. సినిమా ఫ్లాప్ అయినా, సక్సెస్ అయినా థ్యాంక్స్ మీట్‌లు నిర్వహిస్తున్నారు అంటూ నిర్మాత సురేష్‌బాబు ఆ మద్య విమర్శలు చేశాడు. దాంతో కొద్ది మంది అయినా ఫ్లాప్ సినిమాలకు థ్యాంక్స్ మీట్‌లు నిర్వహించడం మానేస్తారని భావించాం. కాని పూరి జగన్నాధ్ తన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ పెద్ద కార్యక్రమంను నిర్వహించి, మీడియా వారికి మిఠాయిు తినిపించి, వారిని లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా థ్యాంక్స్ మీట్ పెట్టి సినిమా సక్సెస్ అంటూ ప్రేక్షకులను నమ్మించేందుకు పూరి ప్రయత్నిస్తున్నాడు. ఇలా చేసి ప్రేక్షకులను మోసం చేయడం కాదని, ఆయన్ను ఆయనే మోసం చేసుకుంటున్నాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.