Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Mind Blowing Facts About Allu Arjun DJ Movie Collections
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ఊహించని విధంగా దిల్‌రాజుకు లాభాలను తెచ్చి పెట్టనట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి 45 నుండి 50 కోట్ల మేరకు బడ్జెట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు ఇప్పటి వరకు అత్యధికంగా బడ్జెట్ పెట్టింది ఈ సినిమాకే అవ్వడం విశేషం. ఇంత బడ్జెట్ బన్నీ కెరీర్‌లో కూడా మొదటి సారి. దాంతో బన్నీ బడ్జెట్‌ను రికవరీ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమాకు భారీగా అంచనాలు రావడంతో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల బిజినెస్‌ను చేయడం అందరిని ఆశ్చర్యపర్చుతుంది. నైజాం ఏరియాలో 17.5 కోట్లు, సీడెడ్‌లో 11.1 కోట్లు, వైజాగ్‌లో 8 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో 7 కోట్లు, కేరళలో 2.5 కోట్లు కర్ణాటకలో 7.1 కోట్లకు ఈ సినిమాను అమ్మారు. మొత్తంగా థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు 78 కోట్లు వచ్చాయి. ఇక ఆడియో రైట్స్, ఆన్ లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 20 కోట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపుగా వంద కోట్లు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాపై అంచనాలు భారీగా పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లను సినిమా ముంచుతుందా తేల్చుతుందా అనేది రేపు సినిమా విడుదల తర్వాత ఫలితం తేలనుంది.
మరిన్ని వార్తాలు: