పుల్లారావు మీద….రజన్నమ్మ శపధం…నెరవేరేనా…?

Minister Prathipati Pullaro Againest Rajanikumari
రాజకీయాల్లో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంటారు తలపండిన రాజకీయ నాయకులు. ఎందుకో నాకు పెద్దగా అర్ధమయ్యేది కాదు. కానీ ఇప్పుడు తాజాగా తెల్సిన ఒక సంఘటన వింటుంటే వారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. అతిపెద్ద జిల్లానే కాక పాటు రాష్ట్రంలోనే అత్యధిక మునిసిపాలిటీలు కలిగిన జిల్లాగా గుంటూరుకు గుర్తింపు ఉంది. ఈ జిల్లా నుంచి ఎన్నికైన నేతలు ముఖ్యమంత్రులుగా సేవలందించిన చరిత్ర కూడా ఉంది. అలా రాజకీయంగా కీలకమైన ఈ జిల్లా రాజకీయాల్లోకి ఓ మహిళ అందునా ఎన్నారై మహిళ ప్రవేశించారు. అది కూడా చాలా వ్యూహాత్మకంగా. ఆమె ఎవరో కాదు నిన్నమొన్నటి దాకా మంత్రి ప్రత్తిపాటి పులారావ్ వెనుక తిరిగినామే పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు దగ్గరయ్యారు. అయితే  టీడీపీకి దేశంతో పాటుగా విదేశాల్లోనూ అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న టీడీపీ అభిమానుల్లో గుంటూరుకు చెందిన విడదల రజనీ కుమారి ఒకరు. ఈమెకు టీడీపీ అంటే పిచ్చి, ఈ క్రమంలో గత ఏడాది విశాఖలో నిర్వహించిన మహానాడులో కూడా పాల్గొంది. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఆసీనులైన ఓ సభలో ఉత్సాహంగా ప్రసంగించి ఆయన దృష్టిలో పడ్డారు. ఆ సమయంలోనే మంత్రి ప్రత్తిపాటి ద్వారా ఆమె సీఎంను పరిచయం చేసుకున్నారు. ఎన్నారై కదా ఏమైనా ఫండింగ్ వస్తుందన్న భావానతో ప్రత్తిపాటి కూడా పరిచయం చేసి ఉంటారు, కానీ ఆయన అలా చేసిన పరిచయమే ఆయన సీటుకే ఎసరు తెచ్చే దాకా వస్తుందని ఊహించి ఉండరు.  వచ్చే ఎన్నికల్లో తనకు చిలకలూరి పేట టికెట్ కావాలని ఆమె తెలుగుదేశం అధిష్టానాన్ని కోరిందట అయితే, ఈ టికెట్‌లో ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని, ఆయనను తప్పించే ప్రసక్తి లేదని అధిష్ఠానం తేల్చి చెప్పినట్లు సమాచారం.
rajani..
ఈ క్రమంలోనే ఆమె తనకు పార్టీలోనూ, బయటా ఉన్న పరిచయాలతో ఢిల్లీ స్థాయి వరకు వెళ్లి లాబీయింగ్ మొదలు పెట్టింది. ఈ విషయం సీరియస్‌గా తీసుకున్న పుల్లారావు తనకు తెలియకుండానే పార్టీ పెద్దలతో పరిచయాలు ఏంటని ఆమెపై సీరియస్ అయ్యారని అందుకే చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్‌గా ఉన్న రజనీకుమారి మామ తన పదవి నుంచి తప్పుకున్నారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. దీంతో రాజకీయంగా తనను అణగదొక్కే ప్రయత్నం చేయడంతో పాటు తమ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన పుల్లారావుని ఓడించి తీరాలని ఆమె రజనమ్మ శపథం చేసింది. అంతేకాక ఇప్పటి వరకు టీడీపీలో సభ్యత్వం ఉన్న రజనీ కుమారి ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా రాజీనామాలు చేసేసింది. దీంతో రజనీ చూపు వైసీపీ వైపు పడిందని అర్ధమయిపోయింది తనను వైసీపీలోకి చేర్చుకోవాలని వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఇవ్వాలని తన టీడీపీ సీనియర్ పుల్లారావును ఓడించి తీరుతానని పార్టీకి బెనిఫిట్ అవుతుందని ఆమె జగన్‌కు రాయబారం పంపింది.
rajanikumari
అయితే, జగన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో పార్టీకి ఫండ్‌తో పాటు ఎన్నికల ఖర్చు భరిస్తానని కూడా రజనీ కుమారి జగన్‌కు మళ్ళీ కబురు పంపింది. ఆమె చెప్పిన ఆఫర్ నచ్చిందో లేక ఆ నియోజకవర్గంలో వైసీపీకున్న మైనస్ గుర్తొచ్చిందో తెలీదు కానీ జగన్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఆమె నిన్న పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి కండువా కప్పేసుకుంది. అయితే ఆమెకు ఆమెకు టికెట్‌పై జగన్ హామీ ఇచ్చారని ఆమె అనుచరులు అంటుంటే లేదు ప్రత్తిపాటిపై పంతంతోనే విడదల రజనీకుమారి జగన్ పార్టీలో చేరారని మరికొందరు అంటున్నారు. అంతేకాక సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారని ఈసారి పోటీచేసే పరిస్థితి లేదని మర్రి రాజశేఖర్ భార్యకు టికెట్ కేటాయించాలని చిలకలూరిపేట వైసీపీ నేతలు జగన్ ను కోరారట, అయితే ఆ విషయంలో జగన్ హామీ ఇవ్వకపోవడంతో ఏ అవకాసం ఉన్నా ఆ టికెట్ రజనీకే అని ఆమె అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి గురువు గారిని శిష్యురాలు బాగానే టెన్షన్ పెడుతోందన్న మాట.
rajani-nri-kumari