120 వాహనాల కాన్వాయ్ తో బెంగుళూరు చేరుకున్న ఎమ్మెల్యేలు !

MLAs arriving at Bangalore with a convoy of 120 vehicles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి విమానంలో బయలుదేరిన కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్లారు. అక్కడ బస చేసిన ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక సీఎల్పీ సమావేశం జరిపి ఈరోజు అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోనున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ కూడా తాజ్ కృష్ణాకు చేరుకున్నారు. నోవాటెల్ హోటల్ లో ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా తాజ్ కృష్ణాకు చేరుకోగా వారిని వెన్నక్కి తీసుకెళ్లడం పై తొలుత మల్లగుల్లాలు పడ్డట్టు తెలిసింది. ఎవరికి తెలీకుండా సీక్రెట్ గా హైదరాబాద్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేల్ని.. తిరిగి బెంగళూరుకు బస్సులో తీసుకెళ్లటం రిస్క్ అన్న వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపించింది.

ఇప్పుడున్నపరిస్థితుల్లో బస్సులో తీసుకెళ్లటం ఇబ్బందే అని ఎమ్మెల్యేల కోసం బీజేపీ ఏమయినా చేసేందుకు వెనకాడదు అని ప్రత్యామ్నాయమైన ఫ్లైట్ జర్నీ గురించి ఆలోచించారు. అయితే.. ఫ్లైట్ జర్నీ అయితే అందరు ఎమ్మెల్యేలు ఫ్లైట్ ఎక్కాక బెంగళూరులో విమానానికి దిగేందుకు అనుమతి ఇవ్వని పక్షంలో.. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు సమయానికి చేరుకోలేరని నిన్న సిద్దరామయ్య హైదరాబాద్ కి వచ్చేప్పుడు ఆరు గంటలు వెయిట్ చేయించారని ఆ రిస్క్ తీసుకునే కన్నా.. బస్సులో భద్రంగా తీసుకెళ్లటం ఉత్తమమన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్.. జేడీఎఎస్ నేతలు బస్సుల్లోనే బెంగళూరుకు రిటర్న్ జర్నీ చేయాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి వచ్చిన బస్సుల్లోనే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బయలుదేరాయి. ఎమ్మెల్యేలు ఉన్న బస్సులకు భారీ భద్రతను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు.

ఒక్కో బస్సుకు ముందు 20 వాహనాలు.. వెనుక మరో 20 వాహనాలు రక్షణగా బయలుదేరాయి. భారీ కాన్వాయ్ తో ఎమ్మెల్యేలు ఉన్న బస్సులు వెళ్లటం సినిమా సన్నివేశాల్ని తలపించింది ఈ మొత్తం తరలింపు కోసం భారీగా పోలీసులని కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. బస్సులు ప్రయాణించే రూట్లలో కాంగ్రెస్ తన పార్టీకి చెందిన నేతల్ని అలెర్ట్ చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు 300మంది పోలీసులతో భద్రతను కల్పించారు. ఐపీఎస్ స్థాయి అధికారులు ఎస్కార్ట్‌ పర్యవేక్షించారు. మొత్తం 120 వాహనాల కాన్వాయ్‌ను టీకాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

అలారాత్రి బయల్దేరిన ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం బెంగళూరు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిల్టన్‌ హోటల్‌కు, జేడీఎస్ ఎమ్మెల్యేలను మెరిడీన్ హోటల్‌ కు తరలించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశంకానుంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు హోటల్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరుగనుంది. ప్రోటెం స్పీకర్ గా ఏన్నికయిన బీజేపీ ఎమ్మెల్యే యద్యూరప్ప కి నమ్మిన బంటు లాంటి బొప్పయ్య ఈరోజు బలపరీక్ష వ్యవహారాన్ని నిర్వహించనున్నారు. దీంతో బీజేపీ మీద సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.