ఇద్దరు చంద్రులు బీజేపీకి నిద్ర కూడా పట్టనివ్వట్లేదా ?

Modi-and-Amit-Shah-gets-sca

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నాటకలో విచిత్రమయిన సమస్య వల్ల అధికారానికి దూరమైన కాష్యాయ నేతలు మీడియాను ఆకట్టుకునే పనిలో పడ్డారు. జాతీయ మీడియానే కాక ప్రాంతీయ పత్రికలు, టీవీ చానల్స్ సంపాదకులు, రిపోర్టర్లతో భేటీ ఏర్పాటు చేసింది. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ వారితో చాలా సేపు ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వారికి ఏం కావాలో దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఈ సందర్భంగా చాలా అంశాలు చర్చకు వచ్చాయట. విచిత్రం ఏమిటంటే బీజేపీ పాలనలో జరుగుతున్న మంచి పనుల గురించి మాటలాడటం మొదలుపెట్టినా అసలు చర్చంతా ప్రాంతీయ పార్టీల గురించే సాగిందట.

బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చచ్చెను అనే నానుడిని బహుశా అమిత్ షా విని ఉండలేదేమో అందుకే ప్రాంతీయ పార్టీల ప్ర‌భావం జాతీయ స్థాయిలో అంత‌గా ఉండ‌ద‌ని ఈజీగా తీసి పారేశారు అమిత్ షా. ఆయా పార్టీల నేత‌లు కేవ‌లం కొన్ని ప్రాంతాల‌కు ప‌రిమితం అవుతార‌నీ, ఆ ప‌రిధి దాటి వారి ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒడిశాలో ప్ర‌చారం చేస్తే ఎవ‌రైనా ఓట్లు వేస్తారా, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప‌శ్చిమ బెంగాల్ పంపించి ప్ర‌చారం చేస్తే ఎవరు వోట్లు వేస్తారు అని ఎద్దేవా చేశారు. ఆయా ప్రాంతాల్లో వీరు బ‌ల‌మైన నాయ‌కులు కావొచ్చు, అంత‌మాత్రాన వారు ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ప్ర‌భావం ఉంటుంద‌ని అనుకోవ‌డం సరైంది కాద‌న్నారు.

ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఏక‌మైనా జాతీయ స్థాయిలో ప్ర‌భావం చూప‌లేవనే విషయాన్నీ హైలైట్ చేయడానికి చూశారు అమిత్ షా! కానీ ఇంత చిన్న లాజిక్ని అమిత్ షా ఎలా మిస్సయ్యారు అనేదే ఇక్కడ ప్రశ్నార్ధకం ఎందుకంటే మామూలుగా చూస్తే చీపురు పుల్లకు అంత బలం ఏమీ ఉండదు. సింఫుల్ గా విరిచేయొచ్చు. కానీ చీపురు పుల్లల్ని కట్టగా కట్టి విరివాలంటే మన తరం కాదు ఎంతటి ఎంత బలవంతుడికైనా ఇబ్బందే. ఈ చిన్న లాజిక్ ని అమిత్ షా మర్చిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేయలేవు. కానీ… ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే… జాతీయ స్థాయిలో అవన్నీ కలిపి ఒక కూటమి ఏర్పాటు చెయ్యచ్చు కదా.

ఇత‌ర ప్రాంతీయ పార్టీల సంగ‌తేమోగానీ, టీడీపీ, టీఆరెస్ లతో భాజ‌పాకి త‌ల‌నొప్పి ఉంద‌నేది అమిత్ మాటల్లో అర్ధం అవుతోంది అందుకే, ఏరికోరి మ‌రీ కేసీఆర్‌, చంద్ర‌బాబుల పేర్లు ఉదహరించి అమిత్ షా మాట్లాడారు. అయితే కర్నాటక ఎన్నికలు బీజేపీ కి కొత్త గుణపాతాన్ని నేర్పాయి అనేది అర్ధం అవుతోంది. ఒకప్పుడు జాతీయ మీడియాని దువ్వుతూ వచ్చిన బీజేపీ జాతీయ స్థాయిలోనే కాక ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలోను మీడియా ను కూడా దువ్వడం గమనార్హం. మొత్తానికి ఇద్దరు చంద్రులు కాషాయ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు అనేది ఇప్పుడు జాతీయ స్థాయి రాజాకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.