Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోడీ హవాకు ఇక ఎదురు లేదు తామే ప్రచండ శక్తి అంటూ ప్రచారం చేసుకున్న బీజేపీకి భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో విజయాన్ని చూసి ఇక మాకు ఎదురు లేదు మేము చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్టు ప్రవర్తించి ఇప్పటికే చాలా వరకూ మిత్ర పక్షలాను దూరం చేసుకున్నారు. ఇప్పుడు వారి వెంట పడే ప్రయత్నాలు చేస్తున్న వారిని విశ్వసించే పరిస్థితి కనపడడంలేదు. అయితే ఇప్పుడు లిఖిత పూర్వకంగా తమ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని అగ్రనాయకత్వానికి తెలిసొచ్చింది.
నరేంద్రమోడీ ప్రభుత్వం పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది… ఇప్పటికే జరిగిన పలు ఉపఎన్నికలలో ఈ విషయం స్పష్టం అవుతున్నప్పటికీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలవటం తప్పదు అని తాజాగా విడుదల అయిన ఒక సర్వే తేల్చి చెప్పింది. తాము సొంతంగా చేపించుకున్న సర్వేలోనే బయటపడటం తో మోడీ షా ద్వయం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ విశ్లేషించింది. ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి బాగోలేదని తేలింది. అంటే ఆ పార్టీకి నికరంగా 132 సీట్లు మాత్రమే వస్తాయి. ఉత్తరాదిలో ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది. బీజేపీ విజయానికి బాటలు వేసిన ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 48 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో గెలిచినా 282 సీట్లల్లో ఈసారి కేవలం 130 సీట్లల్లో మాత్రమే బిజెపి గెలుస్తుంది అని సర్వే తెల్చేసినట్టు అర్ధం అవుతోంది. అయితే సర్వే ఫలితాలు చూసి ప్రధాని మోదీ, అమిత్‌షా కంగుతిన్నారు. దీంతో నష్టనివారణ కోసం ఆరెస్సెస్‌తో అమిత్‌షా చర్చలు జరుపుతున్నారు. అందుకే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది అని హిందీ పత్రిక రాసుకు వచ్చింది.