Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Modi Will Speak About H1B Visas With Donald Trump In US Tour
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఎవర్ని ఎందుకు పొగుడుతారో.. ఎవర్ని ఎందుకు తిడతారో ఎవరికీ అర్థం కాదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా భారతీయుల్ని తెగ పొగిడేసిన ట్రంప్.. పీఠమెక్కగానే హెచ్ 1బీ వీసాలపై లేనిపోని ఆంక్షలు తెచ్చి.. భారతీయుల నోట్లో మట్టికొట్టారు. ఇప్పుడు సడెన్ గా మోడీని పొగడటం షురూ చేశారు.
ఎవ్వరికీ ఇవ్వని వైట్ హౌస్ విందు మొదట మోడీకే ఎందుకు..? ఇది నిజంగా గౌరవమేనా..? లేదంటే అంతకు మించిన కుట్ర ఉందా..? ఎన్నారైలకు ఈ ప్రశ్నలతో నిద్రే రావడం లేదు. వీసా ఇష్యూపై ప్రధాని ట్రంప్ కు చెబుతారనుకుంటే.. అసలు ఇద్దరి మీటింగ్ అజెండాలో ఆ అంశమే లేదు. అందుకే అమెరికాలో దిగగానే మోడీని కలిసిన ఎన్నారైలు వీసా విషయంలో మాట్లాడాలని కోరారు.
మరి మోడీ ఏం చెబుతారు, దానికి ట్రంప్ ఏం బదులిస్తారనేది ఆసక్తికరమే. దౌత్యమర్యాద పాటిస్తే.. అజెండాలో ఉన్న అంశాలే మాట్లాడాలి. మోడీకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకే వీసా గురించి మాట్లాడకపోవచ్చని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. అదే నిజమైతే ఎన్నారైల ఆశలన్నీ గల్లంతైనట్లే. మరి మోడీ, ట్రంప్ భేటీలో ఏం జరుగుతుందో తెలియాలంటే.. మరి కొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.
మరిన్ని వార్తలు