Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ వెండితెర పరిచయం గురించి అధికారిక ప్రకటనే వచ్చేసింది. వచ్చే జూన్ నాటికి మోక్షు సినిమా ప్రారంభం అవుతుందని బాలయ్య స్వయంగా ప్రకటించడంతో ఆ సినిమా గురించి ఫిలిం నగర్ లో చర్చలు మొదలయ్యాయి. బాలయ్య తన కొడుకుని ఏ కథతో పరిచయం చేస్తాడు, ఏ దర్శకుడికి, ఏ నిర్మాతకి ఛాన్స్ ఇస్తాడు అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఓ వార్త బాగా హల్ చెల్ చేస్తోంది. అదేమిటంటే …
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన ఓ ప్రేమ కథ బాలయ్యకి నచ్చిందట. దాన్ని డెవలప్ చేయమని బాలయ్య చెప్పడంతో క్రిష్ ఆ పనిలో వున్నాడట. ఓ వైపు కంగనా తో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక చేస్తూనే రెండో వైపు మోక్షు లాంచింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారట. అది ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి తానే కర్త, కర్మ, క్రియ గా వుండాలని క్రిష్ భావిస్తున్నారట. అంటే… ఈ సినిమాకి తన సొంత నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద చేయాలని క్రిష్ అనుకుంటున్నారట. అయితే ఇంతకు ముందే బాలయ్య తన సన్నిహితుడు సాయి కొర్రపాటి కి మోక్ష ని లాంచ్ చేసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చారట. ఇప్పుడు బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా నందమూరి ఫాన్స్ మాత్రం మోక్షు ఎంట్రీ వార్తతో ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
మరిన్ని వార్తలు: