Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పై నిన్న అధిష్టానం బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేతపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. అయితే మోత్కుపల్లిపై వేటు వేయడంతో పాటు అయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ వర్గాలతో పాటు రాజకీయంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో మరో కోణం ఏమయినా ఉందా అనే అనుమానాలని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే బీజేపీ నుండి చంద్రబాబు బయటకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు మీద బీజేపీ ముప్పేట దాడి చేయిస్తోంది. ఒకపక్క బీజేపీ నేతలు మరోపక్క పవన్ చేత కూడా బాబు మీదనే విమర్శలు చేయిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తునన్నారు. అదే విధంగా మే 15 తర్వాత పరిస్థితులకు చంద్రబాబు ఏమయిపోతదో అంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు విశ్లేషకులు గుర్తుకు తెస్తున్నారు. ఇప్పుడు మోత్కుపల్లి కూడా బాబు మీద బీజేపీ ఎక్కుపెట్టిన బాణమే ? అని వారు పేర్కొంటున్నారు. ఆపరేషన్ గరుడలో ఆయన కూడా ఒక భాగామే అని వారి వాదన.