డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టిన పవన్‌ హీరోయిన్‌…!

Mumtaj-Says-She-Hit-A-Direc

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉంటాయి అనేది బహిరంగ రహస్యం. లైంగిక వేధింపుల గురించి ఎవరు బయట చెప్పేవారు కాదు. అందుకు వారి వారి కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసేవారు. ప్రస్తుతం మీ టూ ఉద్యమంలో భాగంగా ప్రతి మహిళ తనపై జరిగిన లైంగిక దాడులను నిర్మొహమాటంగా బయటపెట్టవచ్చు అనే ధైర్యం కలిగింది. లైంగిక వేధింపుల గురించి పవన్‌ హీరోయిన్‌ ముంతాజ్‌ తాజాగా స్పందించింది. పవన్‌తో ‘ఖుషీ’ చిత్రంలో నటించిన ముంతాజ్‌ లైంగిక వేధింపులు అనేవి కొత్త ఏమి కాదు, కానీ ఓపికగా వాటి నుండి తప్పించుకోవాలి, గతంలో ఎవరు వీటి గురించి స్పందించే వారు కాదు, తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ ముంతాజ్‌ చెప్పుకొచ్చింది.

muntaj

ఒక సినిమా షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ పదే పదే తనను లైంగికంగా విసిగించేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఒకరోజు మితిమీరిన అతని ప్రవర్తనకు చెప్పుతో కొట్టి బుద్ది చెప్పానని, దాంతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్‌ అయ్యారని, ఘాటుగా స్పందిస్తే తప్పా లైంగిక వేధింపుల నుండి బయట పడలేం అంటూ ముంతాజ్‌ చెప్పుకొచ్చింది. ఇవి కేవలం తాను కూడా లైంగిక దాడులను ఎదుర్కొన్నాను అని చెప్పడానికి మాత్రమే, అలానని తాను మీ టూలో భాగం కాదని, మీ టూలో భాగంగా ఆరోపణలు చేసే వారు సమయం వచ్చినపుడు నిరూపించడానికి కూడా సిద్దంగా ఉండాలని, ఏదో మాటలు అనేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్‌ కాదని ముంతాజ్‌ వ్యాఖ్యానించారు.