Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా అను ఎమాన్యూల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ మరియు నాగబాబులు సంయుక్తంగా నిర్మించారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అయ్యింది. దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంను ఏకంగా 85 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా గత బన్నీ చిత్రాలతో పోల్చితే ఎక్కువ స్క్రీన్స్‌లలో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రం నైజాం 21 కోట్లు, వైజాగ్ 8 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఓవర్సీస్ 9 కోట్లు, చెన్నై 1.25 కోట్లు, కేరళ 3 కోట్లు, బెంగళూరు 9 కోట్లు, గుంటూరు 5.5 కోట్లు, వెస్ట్ 4.2 కోట్లు, ఈస్ట్ 5.4 కోట్లు, నెల్లూరు 2.52 కోట్లు, కృష్ణ 5 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా చిత్ర పీఆర్‌ఓ అధికారికంగా ప్రకటించాడు. మొత్తం ఈ చిత్రం 85.87 కోట్లకు అమ్ముడు పోవడంతో పాటు శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఆన్‌లైన్ రైట్స్, ప్రైమ్ వీడియో రైట్స్ అంటే మరో 30 కోట్ల మేరకు వచ్చే అవకాశం ఉంది. ఇక డబ్బింగ్, రీమేక్ రైట్స్ ద్వారా మరింతగా కలెక్షన్స్ వస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్ర నిర్మాతలకు 50 కోట్లకు పైగానే లాభం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.