Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు నటి లెజెండరీ యాక్ట్రెస్ గా ప్రతి ప్రేక్షకుడి గుండెలోను చెరగని ముద్ర వేసిన సావిత్రి బయోపిక్ “మహానటి” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది ‘మహానటి’. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం, సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాల్ని అందుకోవడంలో విజయం సాధించిన నాగ అశ్విన్ సినిమా మొత్తం మీద పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి దొరికిపోయాడు. అంత పెద్ద సినిమాలో ఆ విషయాన్ని వేలెత్తి చూపించడం మా ఉద్దేశ్యం కాదు కానీ సావిత్రి జీవితంలోని చీకటి కోణాల్ని, ఎవరికీ తెలియని చాలా విషయాల గురించి ఎంతో పరిశోధన చేశానని చెప్పుకున్న నాగఅశ్విన్ అందరికీ తెలిసిన ఈ విషయంలో తప్పేలా చేశాడో మరి ?
ఆ మిస్టేక్ ఏంటంటే సావిత్రి ఆస్తులు పోగట్టుకున్న తర్వాత పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ పాత్రలు కాకుండా వేరే పాత్రలు చేయాల్సి వచ్చింది. అయితే అలా చేస్తున్న సమయంలో ఓ రోజు షూటింగ్ ముగించుకుని వెళుతున్న ఆమెని పిలిచి మరీ తనతో భోజనం చేయిస్తారు లెజెండరీ నటులు గుమ్మడి వెంకటేశ్వర రావు. కానీ సినిమాలో మాత్రం ఎస్వీ రంగా రావు సావిత్రికి భోజనం పెట్టినట్టు చూపిస్తాడు నాగ అశ్విన్. అదీ కాక 1975 లో కీర్తి శేషులయిన ఎస్వీఆర్ని 1980 లో సావిత్రితో భోజనం చేసినట్టు ఎలా చుపారో నాగ అశ్విన్ కే తెలియాలి. ఆలోచించి చూస్తే తప్ప స్పురణకి రాని తప్పే అయినా సినిమా మొత్తానికే బ్లండర్ మిస్టేక్ అని చెప్పక తప్పదు.