సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై తాజాగా హిందూ వ్యతిరేకి అంటూ కేసు నమోదు అయ్యింది. రామాయణం గురించి, రాముడు మరియు సీతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ హిందు సంఘం ప్రతినిధులు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు. కత్తి మహేష్‌పై గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి మరియు మెగా ఫ్యాన్స్‌కు పీకల్లోతు కోపం ఉంది. ఆ కోపంతోనే కత్తి మహేష్ కేసులో చిక్కుకోగానే ఎగిరి గంతేసినంత సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ చేసిన పనికి సరైన శాస్తి జరిగిందని, ముందు ముందు మాట మాట్లాడేప్పుడు ఆలోచిస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా కత్తి మహేష్‌పై నమోదు అయిన కేసుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కత్తి మహేష్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలని, హిందువుల మనోభావాలను దెబ్బ తీయడంతో పాటు, మత సామరస్యంను కూడా దెబ్బ తీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. అన్ని మతాల వారు నమ్మే రామాయణం ఒక పుస్తకం కాదని అలాంటి రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని, అందుకే కత్తి మహేష్‌ను కఠినంగా శిక్షించాలని, అతడిని శిక్షిస్తేనే మరొకరు ఇలా మాట్లాడేందుకు భయపడతారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. కేసు నమోదు అయిన తర్వాత కూడా కత్తి మహేష్ రామాయణం మరియు రాముడి గురించి అనుచితంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో కూడా రామాయణంను కించ పర్చే విధంగా ఉంది. అందుకే నాగబాబుతో పాటు పలువురు కూడా కత్తి మహేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు