Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘సరైనోడు’ చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన తుది దశ పనులు జరుగుతున్నాయి. ఇక బోయపాటి తర్వాత సినిమా ఏంటి అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ముందు నుండి అనుకున్న ప్రకారం అయితే చిరంజీవి 152వ సినిమాను బోయపాటి చేయాల్సి ఉంది. అయితే చిరు 152వ సినిమాకు కనీసం సంవత్సరం అయినా పట్టే అవకాశం ఉంది. చిరు 151వ సినిమా ఇంకా మొదలే కాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఉయ్యాలవాడ సినిమా ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. వచ్చే వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
చిరంజీవి 151వ చిత్రం పూర్తి అయ్యేందుకు ఇంకా సంవత్సరం పడుతుంది. అంటే 152వ సినిమా చేయాలి అంటే సంవత్సరంకు ఎక్కువ తీసుకునే అవకాశాలున్నాయి. అందుకే బోయపాటి ‘జయ జానకి నాయక’ చిత్రం విడుదలైన వెంటనే మరో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. చిరు ఉయ్యాలవాడ పూర్తి చేసేలోపు బోయపాటి మరో సినిమాను పూర్తి చేసి చిరు 152కు సిద్దంగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకే త్వరలోనే బోయపాటి కొత్త సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవలే నాగచైతన్యతో బోయపాటి సినిమా అంటూ వచ్చిన వార్తలను కొట్టి పారేశాడు. అంటే బోయపాటి తర్వాత సినిమా చైతూ హీరోగా ఉండదు, మరి ఏ హీరోతో ఈయన సినిమా చేస్తాడు అనేది చూడాలి.
మరిన్నివార్తలు
బిగ్‌బాస్‌లో పోసాని.. 2.5 కోట్ల పారితోషికం
విమానంలో మహేష్… గుట్టు విప్పని మురుగదాస్
నిర్ణయం’ నుండి అఖిల్ టైటిల్!