అమ్మతో కలిసి ఆవకాయ ప్రిపేర్ చేసిన హీరో నాగసౌర్య

ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దేశం మొత్తం ఎక్కడ చూసినా ప్రశాంతంగా కనిపిస్తుంది.సామాన్య జనం నుండి సెలెబ్రిటీల వరకు నేడు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విరామ సమయాన్ని హీరోలు కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు . కాగా యంగ్ హీరో నాగ శౌర్య అమ్మతో కలిసి ఆవకాయ ప్రిపరేషన్ లో పాల్గొన్నారు.

నాగ శౌర్య అమ్మగారైన ఉషా మూల్పూరి పర్యవేక్షణలో ఆవకాయ్ పచ్చడి తయారీ నేర్చుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది. నాగ శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ మంచి విజయం అందుకుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా, నూతన దర్శకురాలు లక్ష్మీ డైరెక్షన్ లో ఓ కొత్త చిత్రాన్ని ఆయన ప్రారంభించారు. రీతూ వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

View this post on Instagram

 

Avakai…♥♥ Learning from mom #Avakai #Homemade #JanathaCurfew #daywithfamily

A post shared by Naga Shaurya (@actorshaurya) on