కంటెంట్ ఉన్న సినిమాలు రావాలే కాని ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గదని ‘Rx 100’తో మరొకసారి నిరూపితమైంది. ఆర్ఎక్స్ 100. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. లిప్ లాక్ సీన్లతోనే సినిమా మొత్తం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాను యువకులు రెండుమూడుసార్లు చూశారు. డైరెక్టర్ అంచనాలను మించి సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. తక్కువ బడ్జెట్‌తో చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ సన్సేషనల్ హిట్‌ను సాధించింది. మొదట్లో బూతు చిత్రంగా విపరీతమయిన ప్రచారం చేసినప్పటికీ ఫైనల్‌గా సగటు ప్రేక్షకుడు సినిమాకి అఖండ విజయాన్ని అందించాడు. బడ్జెట్ తక్కువే అయినా ఈ మూవీ తిరుగులేని కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇంతకీ సినిమా డైరెక్టర్ కొత్త వ్యక్తి అజయ్ భూపతి. రాంగోపాల్ వర్మ శిష్యుడు. మొదటి సినిమాతోనే తెలుగు సినీపరిశ్రమలో చర్చకు తెరతీశారు అజయ్ భూపతి. గ్రామస్థాయి పాలిటిక్స్, గ్రామాల్లో ప్రేమికుల మధ్య ఉండే నాటు సరసం, భావోద్వేగాలను ఒడిసిపట్టుకోవడంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీపై తాజాగా ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు కింగ్ నాగార్జున. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘చి.ల.సౌ‘ చిత్రం మంచి అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం నాడు జరిగిన ‘చి.ల.సౌ’ మీడియా సమావేశంలో నాగార్జున పాల్గొని ఇటీవల విడుదలై విజయవంతమైన చిత్రాల గురించి మాట్లాడుతూ ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తనకు బాగా నచ్చిందంటూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.