Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రిస్మస్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు నాని నటించిన ‘ఎంసీఏ’ మరియ అఖిల్ నటించిన ‘హలో’ చిత్రాలు ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా స్థాయిలో అంచనాలను కలిగి ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా భారీ ఎత్తున ఈ సినిమాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ‘హలో’ను సోలోగా తీసుకు రావాలని నాగార్జున భావించాడు. అందుకే ‘ఎంసీఏ’ చిత్రాన్ని వాయిదా వేయించాలని ప్రయత్నించాడు. కాని దిల్‌రాజు మాత్రం ‘ఎంసీఏ’ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేసి తీరాలని భావించాడు. దాంతో ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాల పోటీ కారణంగా ‘హలో’ చిత్రం ఎక్కువ లాస్ అయ్యే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
నాని వరుసగా భారీ విజయాలు దక్కించుకుంటూ వెళ్తున్నాడు. ఈ చిత్రంతో మరో విజయాన్ని నాని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అందుకే ‘హలో’ సినిమా యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విషయమై నాగార్జునను ప్రశ్నిస్తే ఆయన లెక్కలు ఆయన చెబుతున్నాడు. ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు వచ్చిన సందర్బాలున్నాయి. వచ్చే సంక్రాంతికి లెక్కకు మించి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని కూడా తప్పకుండా థియేటర్లను దక్కించుకుంటాయి.
అలాగే ఈ రెండు సినిమాలకు కూడా థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి అని తాను భావించడం లేదని, ఎనిమిది రోజుల పాటు సెలవులు ఉన్నాయి. కనుక రెండు చిత్రాలకు కూడా మంచి కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయని నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నాడు. రెండు సినిమాలు కూడా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యి, ఎక్కువ కలెక్షన్స్‌ను సాధిస్తాయనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉన్నాడు. మరి ఆయన నమ్మకం నిజం అవుతుందా, ఎంసీఏ కారణంగా హలో చిత్రం తిప్పలు పడనుందా? అనేది చూడాలి.