Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుటుంబం, వ్యాపార పనులతో బిజీగా ఉన్న మహేశ్ బాబు భార్య నమ్రత ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తమ కుమార్తె సితార మరాఠీ వేషధారణలో ఉన్న ఫొటోను ఇటీవల పోస్ట్ చేసిన నమ్రత ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ఉంచారు. సూపర్ స్టార్ కృష్ణ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోను, స్పైడర్ షూటింగ్ స్పాట్ లో మహేశ్ బాబు దిగిన ఫొటోను కలిపి పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో కృష్ణ, మహేశ్ బాబు ఒకే భంగిమలో కూర్చున్నారు. అప్పటి కాలానికి తగ్గట్టుగా ఉన్న డ్రెస్ తో కృష్ణ కాలిమీద కాలు వేసుకుని కూర్చుని ఉండగా, మహేశ్ ఇప్పుడు ట్రెండ్ కు తగిన డ్రెస్ లో తండ్రిలానే కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
ఈ రెండు ఫొటోలకు నమ్రత అప్పుడు మా లెజెండరీ మామగారు, ఇప్పుడు ఆయన అందమైన కుమారుడు అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ప్రస్తుతం స్పైడర్ షూటింగ్ లో భాగంగా ఓ పాట చిత్రీకరణకోసం మహేశ్ బాబు రొమేనియాలో ఉన్నాడు. అక్కడ షూటింగ్ సెట్ లో దిగిందే ఈ పొటో. స్పైడర్ దసరా కానుకగా సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేశ్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేనలోనటించనున్నాడు.
మరిన్ని వార్తలు: