నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడు సంవత్సరాల క్రితం త్వరలోనే తన కొడుకు సినిమా ఉంటుందని ప్రకటించిన బాలకృష్ణ ముందుకు జరుపుతూ పోతున్నాడు. ఆ మద్య వయస్సు రాలేదని, మొన్నటికి మొన్న చదువు పూర్తి కాలేదు అంటూ సాకులు చెబుతూ వస్తున్న బాలకృష్ణ ఈ సంవత్సరం తన కొడుకును ఎంట్రీ ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం సినిమాల కోసం మోక్షజ్ఞ సిద్దం అవుతున్నాడు. చిన్నప్పటి నుండి లడ్డుగా, బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ప్రస్తుతం లావు తగ్గే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వయస్సుకు తగ్గట్లుగా కనిపించేందుకు మోక్షజ్ఞ కనీసం 8 నుండి 10 కేజీలు తగ్గాల్సిందే అంటూ ట్రైనర్స్ చెప్పడంతో ఆ పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.
బరువు తగ్గేందుకు మోక్షజ్ఞ ఏకంగా సింగపూర్ వెళ్లినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మూడు నెలల పాటు బరువు సహజంగా తగ్గి ఇండియాకు రాబోతున్నాడు. ఎన్టీఆర్ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ నటిస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. మొదట బాలకృష్ణ వద్దనుకున్నా కూడా ఇదే మంచి అవకాశం అని పలువురు సలహా ఇవ్వడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాజాగా క్రిష్ సలహా మేరకు బరువు తగ్గమంటూ తనయుడిని సింగపూర్ పంపించినట్లుగా తెలుస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా ఎన్టీఆర్ అయితే వచ్చే సంక్రాంతికే నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది.