Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయినా కూడా ఈమె మాత్రం దిల్‌రాజు బ్యానర్‌లో రెండు సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యింది. అందులో భాగంగా మొదటి సినిమా నానితో కలిసి చేస్తోంది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న నాని సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబో సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. వరంగల్‌లో సాదా సీదాగా ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది.
హన్మకొండలోని బాగా రద్దీ ఉండే రోడ్డుపై నాని, సాయి పల్లవిలు బైక్‌పై వెళ్లే సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. యమహ పాత మోడల్ బైక్‌పై సాయి పల్లవిని ఎక్కించుకుని నాని చెక్కర్లు కొడుతుంటే హన్మకొండ వాసులు చూసి ఫిదా అవుతున్నారు. సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న నాని, సహజంగా నటించే సాయి పల్లవితో సినిమా చేస్తుండటంతో ఖచ్చితంగా వీరిద్దరి మద్య కెమిస్ట్రీ వర్కట్ అవ్వడం ఖాయం అని భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చకచక పూర్తి చేసి ఇదే సంవత్సరం డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని దిల్‌రాజు ప్లాన్. వేణు శ్రీరాం దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా నానికి మరో సక్సెస్‌ను తెచ్చి పెట్టడం ఖాయం అని సినీ వర్గాల వారు మరియు నాని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
మరిన్ని వార్తలు:
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అతి పెద్ద బ్యాడ్ న్యూస్
సాహోలో మందిరాబేడీ