సీజన్ మారుతోంది. చలి తగ్గి వేడి పెరుగుతోంది. ఆ వేడిని ఇంకాస్త పెంచింది తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ విద్యాసంస్థల మధ్య యుద్ధం. ఇటీవల NTSE పరీక్షలో తిరుగులేని ఫలితాలు సాధించామని చెప్పుకుని ఆపై సెల్ఫ్ సెంటర్స్ గుట్టు బయటికి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న శ్రీచైతన్య మీద పోటీ సంస్థ నారాయణ దాడి ఉధృతం చేసింది . ఇప్పటికే విద్యార్థి సంఘాల ఆందోళనలు, హెచ్చరికలకు సమాధానం చెప్పలేక పోతున్న చైతన్యకు నారాయణ సంస్థ ఛాలెంజ్ విసిరింది. చేసింది ఒక్క ఛాలెంజ్ అయినా అందులో చాలా విషయాలు వున్నాయి.
Injso, ఇండియన్ నేషనల్ బయాలజీ ఒలింపియాడ్, ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ సహా పోటీ పరీక్షల్లో ఎవరు ఉత్తమ ఫలితాలు సాధించారో తేల్చుకుందామని నారాయణ సవాల్ విసిరింది. ఇప్పటి దాకా మ్యాథ్స్ కి నారాయణ పెట్టింది పేరు అనుకుంటే, చైతన్య కి ఉక్కు కవచం లాంటి బయాలజీ విభాగంలోనూ తాము మంచి ఫలితాలు సాధించామని నారాయణ సంస్థల ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. రిజల్ట్స్ విషయంలో చైతన్య చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదంటున్న నారాయణ స్టాఫ్ కొన్ని కీలక ప్రశ్నలు ముందుకు తెచ్చింది. సవాళ్ళను విసిరింది .
1 . Injso ( ఇండియన్ నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ ) లో 100 కి 100 శాతం విద్యార్థులని ఒకటో దశ నుంచి రెండో దశకు, ఆపై క్యాంపు కి పంపిన ఘనత నారాయణకి మాత్రమే సొంతం కాదా?
2 . ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో గత రెండు సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి క్యాంప్ కి సెలెక్ట్ అయిన 4 గురు విద్యార్థులు నారాయణకు చెందిన వారు కాదా ? .
3 . ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒలింపియాడ్ క్యాంపుకి కి ఒకే విద్యాసంస్థ నుంచి 18 మందిని పంపిన ఘనత నారాయణ కి తప్ప ఇంకా ఎవరికైనా ఉందా ?
4 . తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ కి ఎంపికైన విద్యార్థులు ఇద్దరు నారాయణ నుంచి వచ్చిన వాళ్ళు కాదా ? అలాంటప్పుడు ఇంకెవరైనా తాము బయాలజీ లో గొప్ప అని ఎలా చెప్పుకోగలరు ?
5 . ఇక ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో గోల్డ్ , సిల్వర్ మెడల్స్ సాధించిన తెలుగు వాళ్లంతా విద్యార్థి దశలో నారాయణ నుంచి వెళ్లిన వాళ్ళు కాదా ?
6 . ఐఐటీ ప్రకటించే మొత్తం 30 వేల ర్యాంకుల్లో ఎక్కువ ర్యాంకులు వచ్చాయని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ సీట్లు ఎవరికి దక్కాయో లెక్కలు వేసుకోగలరా ?
ఇలా ఓ విద్యా సంస్థ పేరు ఎత్తకపోయినా ఇంకో సంస్థకి ఛాలెంజ్ చేయడం విశేషమే. పైగా తాము చెప్పిన విషయాల్లో ఒక్క తప్పు ఉందని నిరూపించినా వాళ్ళకి పూలాభిషేకాలు, పాదాభివందనాలు చేయడానికైనా రెడీ అంటోంది నారాయణ. మొత్తానికి నారాయణ ఈ రేంజ్ లో సవాల్ చేయడంతో చైతన్య డిఫెన్స్ లో పడేలా వుంది. కావాలంటే నారాయణ ఛాలెంజ్ ఏ స్థాయిలో వుందో తెలుసుకునేందుకు మీరు కూడా ఈ వీడియో మీద ఓ లుక్ వేయండి.