Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఫెవికాల్ యాడ్ లో తమ గమ్ము ఎంత గట్టిదో వాళ్లు చూపిస్తుంటారు. కుర్చీలకు అంటించి ఆ కుర్చీలో కూర్చున్నవారు.. లేవడానికి పడే అవస్థల్ని.. తమ గమ్ము గట్టితనానికి నిదర్శనంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ మధ్య కూడా అలాంటి బంధమే ఏర్పడింది. ఇప్పట్లో ఈ బంధం తెగే సూచనలు కనిపించడం లేదు. ఈ బంధం కూడా ఏపీ సీఎంను టెన్షన్ పెట్టడానికే అనే వాదన ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి దళితుడు కాబట్టే మద్దతిచ్చామని కేసీఆర్ చెప్పారు. ఇక ఉపరాష్ట్రపతి విషయంలో సమర్థించుకోవడం ఇంకా ఈజీ. చాన్నాళ్లకు తెలుగు వాడికి ఉన్నత పదవి దక్కుతుంటే అడ్డుపడబోమని కేసీఆర్ చెప్పేశారు. మోడీ ఫోన్ చేసి మద్దతు కోరగానే.. అసలు వెంకయ్యకు మద్దతు కోరడం ఏంటి. అడక్కపోయినా ఇస్తామని కేసీఆర్ చెప్పేశారట.
ఇక కేసీఆర్ కూతురు కవిత , కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు కూడా వెంకయ్యకు శుభాకాంక్షలు చెప్పేశారు. ఆయనకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే వెంకయ్య తరపున వీళ్లు రంగంలోకి దిగి పార్లమెంటులో ప్రచారం కూడా చేస్తారని సెటైర్లు పడుతున్నాయి. అంత అవసరం లేకపోయినా.. టీఆర్ఎస్ మాత్రం కాస్త ఎక్కువే చేస్తుందనేది పార్లమెంట్ టాక్.
మరిన్ని వార్తలు