Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో ప్రధాని నరేంద్రమోడీకి దీటైన రాజకీయ వేత్త మరొకరు కనిపించటం లేదు. అత్యంత బలమైన, ప్రజాకర్షక నేతగా ఆయన రోజురోజుకూ తన బలం పెంచుకుంటున్నారు. మూడేళ్ల అధికారం తర్వాత కూడా మోడీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉంటూనే… అనేక రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో అయినా… మోడీకి ప్రత్యామ్నాయ నేత లేరు. అనేక సర్వేల్లోనూ ఈ విషయమే వెల్లడవుతోంది.
తాజాగా…ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్ మీడియా దిగ్గజం లింక్డిన్ పవర్ ప్రొఫైల్ లిస్ట్ తయారుచేసింది. ఆ జాబితాలో 2.2 మిలియన్ ఫాలోవర్లతో మోదీ చోటు దక్కించుకున్నారు. భారత్ కు చెందిన ప్రముఖుల ప్రొఫైల్స్ పరిశీలించి 2017 లిస్ట్ తయారుచేసింది లింక్డిన్. ఈ జాబితాలో ఈ సంవత్సరం కొత్తగా నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్థానం దక్కించుకున్నారు. మోడీ లింక్డిన్ లిస్ట్ లో చోటు దక్కించుకోవటం ముచ్చటగా ఇది మూడోసారి. లింక్డిన్ లోనే కాదు. దేశంలో ఏ సంస్థ నిర్వహించిన సర్వేలో అయినా మోడీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మోడీ ప్రసంగాలకూ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది.
స్వతంత్ర భారత చరిత్రలో ప్రథమ ప్రధాని నెహ్రూ తర్వాత అత్యంత ఆకర్షణీయంగా ప్రసంగించే నేత మోడీ అని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. మోడీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ కమలనాథుల ఆత్మవిశ్వాసాన్నిరెట్టింపు చేస్తోంది. తొలుత 2024 వరకు అధికారాన్ని నిలబెట్టుకోవటమే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఇప్పుడు…ఆ టార్గెట్ ను మరింత పెద్దది చేసుకుంది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. మరో 50 ఏళ్లు బీజేపీని అధికారంలో ఉంచాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా చెప్పారు. దేశప్రజల్లో ప్రధానికి పెరుగుతున్న ఆదరాభిమానాలు… కాంగ్రెస్ సహా బలహీనపడుతున్న ప్రతిపక్షాల పరిస్థితిని గమనించే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వార్తలు: