Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ సీఎంగా విజయవంతంగా విధులు నిర్వర్తించిన మోడీ.. అసాధారణ మెజార్టీతో ప్రధాని అయ్యాక.. సంవత్సరం పాటు హస్తిన వాతావరణాన్ని అర్థం చేసుకోవడానకి టైమ్ తీసుకున్నారు. తర్వాత వరుస సమావేశాలతో సీనియర్ ఆఫీసర్లను కూడా హడలగొట్టి.. తనకు అనుగుణంగా మలచుకున్నారు. అందుకే నోట్ల రద్దు, బినామీ ఆస్తుల నియంత్రణ, జీఎస్టీ వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకోగలుగుతున్నారు.
కానీ మోడీ అంతటితో ఆగరని, తర్వాత బిగ్ స్టెప్ ఉందని ఢిల్లీ వర్గాలు గెస్ చేస్తున్నాయి. తాజాగా అవినీతి అధికారుల లిస్ట్ తీయాలని హోం శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు అన్ని శాఖాధిపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. లిస్ట్ తయారుచేయకపోతే హోం శాఖ ఊరుకోదు. తయారుచేస్తే.. ఆఫీసర్లు తిరగబడి.. తమకిచ్చిన వాటా సంగతి చెబుతారేమోనని భయం. దీంతో హెచ్ ఓడీలు తర్జనభర్జన పడుతున్నారు.
మోడీ అనుకుంటే చేసేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు చెప్పినట్లుగా అవినీతి అధికారుల లిస్టు తీసి, వారి ఆస్తులపై సీబీఐ దాడులు జరిపితే.. దేశవ్యాప్తంగా కలకలం రేగడం ఖాయం. అప్పుడు బ్లాక్ మనీ ఎక్కడున్నా బయటకు వస్తుందనేది మోడీ భావన. పరిస్థితి చూస్తుంటే.. ఎవరి సీటు కిందకు నీళ్లొస్తాయో తెలియడం లేదని ఢిల్లీ అధికారులు కంగారు పడుతున్నారు.
మరిన్ని వార్తలు:
మళ్లీ మొదలైన అసహనం గొడవ