Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనను పీఎం అభ్యర్థిగా దేశవ్యాప్తంగా అందరూ అంగీకరించినా.. నితీష్ కుమార్ అనే ఓ వ్యక్తి మాత్రం గట్టిగా అడ్డుకుని, గోద్రా అల్లర్లను గుర్తుచేయడంపై అప్పట్లో మోడీ తీవ్రంగా మండిపడ్డారు. అయితే అప్పటి అవసరం కోసం లోపల ఎంత బాథున్నా.. పైకి లేని నవ్వు తెచ్చుకుని కనిపించారు. కానీ ప్రధాని అయ్యాక బీహార్ సర్కారులో ఎలా నిప్పు రాజేయాలో అలా పెట్టారు. నితీష్ ను ఏకపక్షంగా నాయకుడిగా ప్రకటించిన లాలూను.. మహాకూటమి నుంచి లాగడానికి సీబీఐని పావులా వాడుకున్నారు. లాలూను కేసులతో ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసి ఏదొకటి చేసి, మొత్తం మీద మహాకూటమిని విచ్ఛిన్నం చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా నితీష్ మోడీతో జట్టుకట్టి దిద్దుకోలేని పొరపాటు చేశారు.
కానీ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో నితీష్ కు కనీసం ఆహ్వానం కూడా రాలేదు. జేడీయూకు రెండు మంత్రి పదవులిస్తామని మోడీ చెప్పినా.. నితీష్ మూడు అడగడంతో పీటముడి పడింది. దీంతో పాత పగలు గుర్తుతెచ్చుకున్న మోడీ.. ఆయన్ను ప్రమాణ స్వీకారానికి కూడా పిలవకుండా అవమానించారు. ఇప్పుడు ఇంటా, బయటా నితీష్ కు ఒత్తిడి ఎక్కువైంది. మరి బీజేపీతో అన్నా నితీష్ ఎంతకాలం పొత్తు కొనసాగిస్తారో చూడాల్సిందే.
మరిన్ని వార్తలు: