ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార. విక్టరీ వెంకటేష్ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే మరో వైపు తనను సూపర్ స్టార్ చేసిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటివరకు తమిళంలో అరం డోరా కోలమావు కోకిల ఐరా కొలైయుదిర్కాలం’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అయితే అప్పట్లో కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘రాఘవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2006లో విడుదలై తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం ఈ సినిమాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరో పక్క నయనతార కంటే కూడా అనుష్కనే ఫైనల్ చెయ్యొచ్చని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే గతంలో అనుష్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘యెన్నై ఆరిందాల్’ చిత్రంలో నటించగా వీరి కాంబోలో ఒక లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటించాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు ‘రాఘవన్ -2’ లో నటించనుందట. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ లో ఉన్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. ఆ సినిమా పూర్తయ్యాక ‘రాఘవన్ -2’ చిత్రాన్ని పట్టాలెక్కించనుందని చిత్రబృందం తెలిపిన సమాచారం. మరి కమల్ తో నయనతార డ్రీం తీరనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.