Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Nederland PM Copied Narendra Modi On Twitter
మనకు తెలిసి 64 కళలున్నాయి. వాటిలో చోరకళ కూడా ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ లిస్టులో కాపీ కళను కూడా యాడ్ చేయాల్సిన టైమొచ్చేసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ ప్రధాని ఆ అవకాశం కల్పించారు. పీఎం మోడీ తరహాలో ట్వీట్ చేయబోయి భంగపడ్డారు. నెటిజన్ల ముందు అభాసుపాలయ్యారు. ఈ అనుభవంతో కాపీ కొట్టడం చాలా కష్టమని ఆయన తెలిసొచ్చింది.
అమెరికా నుంచి నెదర్లాండ్స్ వెళ్లిన మోడీ.. అక్కడ స్థానిక భాషలో ట్వీట్ చేశారు. ఇలాంటి పనులు మోడీకి అలవాటే.. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలన్న సామెతను ఆదర్శంగా తీసుకుని వెళ్లినచోటల్లా స్థానికుల్ని ఆకట్టుకుంటారు మోడీ. దీంతో మోడీని అనుకరించాలని ఫిక్సైన రుట్టే.. హిందీలో ట్వీట్లు చేసి భారతీయుల మనసులు కొల్లగొట్టారని ప్లాన్ వేశారు. దారుణంగా ఫెయిలయ్యారు.
హిందీ భాష అర్థం చేసుకోకుండా ట్వీట్లు చేయడంతో.. చాలా చోట్ల పదాలు కలిసిపోయాయి. దీంతో ప్రధాని ఏం చెబుతున్నారో ఎవరికీ ఆర్థం కావడం లేదు. నెదర్లాండ్స్ పీఎం టార్గెట్ గా జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే తెలుగు సామెత తరహాలో ఇంగ్లీష్ ప్రోవెర్బ్ ఉంటే.. ఇప్పుడు ఆయన దాన్ని నెమరవేసుకుంటూ ఉంటారు.
మరిన్ని వార్తలు: