Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీ రెడ్డి, గత కొద్ది రోజుల ముందు వరకు ఈమె గురించి పరిచయం చేయాల్సి వచ్చేది ఏమో ఇప్పుడయితే తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూన్న ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. అయితే గత కొద్ది రోజులుగా వ్యాఖ్యలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈమె ఈరోజు ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందుగా బట్టలన్నీ విప్పేసి నిరశన చేయడం సంచలనంగా మారింది. తనకి ‘మా’ సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్ ఆవరణలో అర్ధనగ్నంగా ఆమె నిరసన తెలిపింది.
గత కొద్ది రోజుల క్రితం ఒక చానెల్ లైవ్ డిబేట్ లో నటి కళ్యాణి తో బాటు పాల్గొన్న ఆమె ఒక టెలివిజన్ ఛానెల్లో ఏదో భూతులు మాట్లాడారని వారిపై అందరూ నిరసన దిగి నటీనటులంతా ఘాటుగా స్పందించారని అదే నా విషయంలో నాకు న్యాయం జరుగడం లేదు. నాకు కనుక న్యాయం జరుగకపోతే ఫిలింనగర్లో బట్టలు లేకుండా నగ్నంగా నిలబడుతా అని లైవ్ డిబేట్ లోనే శ్రీరెడ్డి హెచ్చరించింది.
శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నటి కల్యాణి స్పందించింది. ఇలా చవకబారు రీతిలో శ్రీరెడ్డి వ్యవహరిస్తే పరిశ్రమ పెద్దలు, నటీనటులు ఎవ్వరూ ముందుకు రారు అని అన్నారు. శ్రీరెడ్డికి అండగా నిలువాలి అని తాను కొందరిని కోరగా.. సినీ పరిశ్రమను బజారుకు ఈడిస్తే ఎవరు మద్దతిస్తారని నన్ను కొందరు నిలదీశారు అని కల్యాణి చెప్పుకొచ్చింది. ఓ దశలో నాకు న్యాయం జరుగకపోతే ఫిలింనగర్లో బట్టలూడదీసుకొని నిలబడుతానని వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కల్యాణి మండిపడింది.
మీడియాలో ఇలా నోరు పారేసుకొంటున్న నీవు ఆడదానివేనా అని కల్యాణి నిలదీసింది. ఓ దశలో గొంతు పిసికేందుకు ప్రయత్నం చేసింది. అనంతరం ఆమెని దగ్గరకి తీసుకున్న కళ్యాణి శ్రీ రెడ్డిని ఓదార్చింది. శ్రీరెడ్డి మాత్రం ఆరోజు చెప్పినట్టే బట్టలు లేకుండా నగ్నంగా నిలబడింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆమె మానసిక స్థితి మీద సినీ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తో సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట, ఓపెన్ ప్లేస్ లో ఇలా అర్థనగ్నంగా నిరసన తెలపటంపై సామాన్య పౌరులు సైతం ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు అయితే ఆమె అర్ధనగ్న ప్రదర్శనని లైవ్ కవరేజ్ ఇచ్చిన ఛానెల్ ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దిగజారిన చెత్త ఐడియాలతో టీఆర్పీలు పెంచుకోవాలనే ఆలోచన ఛానెల్స్ కి ఈమధ్య బాగా ఎక్కువైపోయింది… ఓ మతిస్థిమితం లేని నటిని రెచ్చగొట్టి, బహిరంగంగా నగ్న దేహంతో నుంచోబెట్టి ఇంటర్వ్యు చేస్తూ లైవ్ ఇవ్వడం దిగజారిన మీడియా విలువలకి నిదర్శనం అని తూర్పారబడుతున్నారు.
ఆమె నగ్నంగా మా అసోసియేషన్ ముందు నగ్నంగా ప్రదర్శనకు దిగే సమయంలో సదరు ఛానెల్ ఒక్కటే ఎందుకు ప్రత్యక్షమైంది..? అసలు ఆమె గేటు నుండి ఎంటర్ అవ్వడం నుండి బట్టలు విప్పే దాకా లైవ్ ఇస్తూ మొత్తం ఈ ప్రదర్శనకు కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా వ్యవహరించింది ఆ ఛానెల్ నే అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరో వాదన చేసే వారు లేకపోలేదు ఫిలిం ఛాంబర్ పక్కనే సదరు ఛానెల్ ఆఫీస్ అని అంటున్నారు. పోనీ పక్కనే అయితే మాత్రం బట్టలు విప్పుతున్న ఓ నటిని వారించి ఆపవలసింది పోయి లైవ్ ఇవ్వడం ఏమిటి ? చానళ్ళ విచ్చలవిడి ప్రసారాల మీద కూడా సెన్సార్ ఏర్పాటు చేయకపోతే పరిస్థితులు చేజారే ప్రమాదం ఉంది.